జనవరి 10న ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’ పాటల వేడుక!

‘ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ చిత్రంపై వుంది. షూటింగ్ ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ”ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్ తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్ గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్ తరుణ్ సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారంలా వుంటుంది. జనవరి 10న ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసి, జనవరి మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. రాజ్ తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ,రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ-స్కీన్ ప్లే–దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్సిస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ : కూటమికి 98 నుంచి 120 సీట్లు

దేశంలో అత్యంత ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించే సంస్థగా పేరున్న యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ అంచనాలను ప్రకటించింది. కూటమి యాభై శాతానికిపైగా ఓట్లతో 98 నుంచి 120 సీట్ల...

జగన్‌ను ఇప్పటికీ మోసం చేస్తున్నారు !

వైసీపీకి ఘోర పరాజయం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయింది. అయితే వైసీపీకి చెందిన వారు మాత్రం ఇంకా జగన్ ను మభ్య పెట్టాలనో మోసం చేయలనో చూస్తున్నారు....

సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు నిలబెట్టుకున్న బీఆర్ఎస్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇక్కడ...

అరుణాచల్, సక్కిం అసెంబ్లీలో యాక్సిస్ ఎగ్జిట్పోల్స్ వంద శాతం కరెక్ట్ !

యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇండియా టుడేలో ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితత్వం మరోసారి స్పష్టమయింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన నాలుగు రాష్ట్రాల్లో రెండు ఈశాన్యరాష్ట్రాల్లో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close