బాబాయి కేన్సర్ ఆసుపత్రికి జూనియర్ విరాళం?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు రెండూ సంక్రాతి పండుగకే విడుదలవుతుండటంతో వారిద్దరి అభిమానుల మధ్య తెర వెనుక చిన్న యుద్ధం జరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి తన కొడుకు జూ.ఎన్టీఆరే అసలయిన వారసుడు అని నందమూరి హరికృష్ణ ప్రకటించడంతో ఆ యుద్ధం ఇంకా తీవ్రమయింది.

ఇద్దరి సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో, జూ. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ప్రధాన సెంటర్లలో ధియేటర్లు దక్కకుండా బాలకృష్ణ వర్గం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాదు నందమూరి అభిమానులు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని బాయ్ కాట్ చేయాలని మౌఖిక సందేశాలు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీటిని బాలకృష్ణ అభిమాన సంఘాలు ఖండిస్తున్నాయి. తమ అభిమాన హీరో బాలకృష్ణపై బురద జల్లి, ఆయనని అప్రదిష్ట పాలుచేసేందుకే కొందరు పనిగట్టుకొని ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కానీ హరికృష్ణ ‘వారసత్వ ప్రకటన’ తరువాత బాలకృష్ణ అభిమానులు తమ హీరోయే స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అసలయిన వారసుడు అని కొన్ని చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సామాజిక వెబ్ సైట్లలో కూడా ఇరువురి అభిమానుల మధ్య ఈ అంశంపై చిన్న యుద్ధం జరుగుతోంది ప్రస్తుతం.

ఇటువంటి సమయంలో జూ.ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ అద్వర్యంలో నడుస్తున్న బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి రూ.6.25 లక్షలు, ఎన్టీఆర్ ట్రస్టుకి మరో రూ.6.25 లక్షల విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. మాటీవీ ఛానల్లో నాగార్జున నిర్వహిస్తున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు?” అనే కార్యక్రమంలో జూ. ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో దాని షూటింగ్ కూడా పూర్తయింది. ఆ కార్యక్రమం త్వరలోనే మా టీవీలో ప్రసారం కాబోతోంది. అందులో జూ. ఎన్టీఆర్ గెలుచుకొన్న రూ.12.5 లక్షలలో సగం మొత్తాన్ని బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి, మిగిలిన మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకి విరాళంగా ఇచ్చినట్లు తాజా సమాచారం. తెర వెనుక అభిమానుల మధ్య జరుగుతున్న యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే జూ.ఎన్టీఆర్ ఆవిధంగా చేసారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close