పాకిస్తాన్, క్వెట్టాలో బాంబు దాడి,14మంది మృతి

పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ రాష్ట్రంలో క్వెటా పట్టణ శివార్లలో ఈరోజు ఉదయం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తుపాకులతో, బాంబులతో దాడి చేసారు. ఆ దాడిలో 14 మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 13 మంది పోలీసులేనని బలోచిస్తాన్ హోం మంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తి తెలిపారు. క్వెటా పట్టణ శివార్లలో గత రెండు రోజులుగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఒక శిబిరం నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా అది మొలయిన కొద్ది సేపటికే కొందరు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుతూ శిబిరం సమీపంలో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడ్డారు. ఆ ధాటికి సమీపంలో భవనాల అద్దాలన్నీ పగిలిపోయాయి. పోలియో శిబిరానికి కాపలాగ ఉన్న పోలీసులు వారిని ఎదుర్కొనే ప్రయత్నంలో మరణించినట్లు మీర్ సర్ఫరాజ్ బుగ్తి చెప్పారు.

ఈ సంగతి తెలిసిన వెంటనే అదనపు భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. పోలియో శిబిరంలో ఉన్న వారిని అందరినీ సురక్షితంగా అక్కడి నుండి తరలించి, శిబిరాన్ని మూసివేశారు. గాయపడిన వారిని స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారికి వైద్యం అందిస్తున్న డా. రషీద్ జమాలి తెలిపారు.

పాకిస్తాన్ లోని పోలియో శిబిర నిర్వాహకులపై గత కొంత కాలంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమయిన విషయమే. ఎందుకంటే నేటికీ పాకిస్తాన్ దేశం పోలియో పీడిత దేశంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కనుక ఆ దేశంలో చిన్నారులను ఈ పోలియో మహమ్మారి బారిన పడకుండా కాపాడేందుకు ఈ ఏడాది ఐదేళ్ళ వయసులోపు గల 24 లక్షల మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయాలని పాక్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రభుత్వ, స్వచ్చంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ముస్లింల జనాభా పెరగకుండా ఉండేందుకు ఈ పోలియో చుక్కల ద్వారా వారిని బాల్యంలోనే ‘స్టెరిలైజ్’ చేసేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయనే పుకార్లు కొందరు మత ఛాందసవాదులు ఆ దేశంలో వ్యాపింప చేస్తున్నారు. ఆ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఈ పోలియో శిబిరాలకు దూరంగా ఉంటున్నారు. పట్టాణ ప్రాంతాలలో ఈ శిబిరాలు నిర్వహించినపుడు ఈవిధంగా దాడులు జరుగుతున్నాయి. దాని వలన దేశంలో పోలియో మహమ్మారికి వేలాది మంది పిల్లలు బలవుతున్నారు. మత చాందసవాదం పెరిగి వికృత రూపం ధరిస్తే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో అర్ధం చేసుకోవడానికి ఇదే ఒక మంచి ఉదారణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close