సినిమా వాళ్ళ కష్టం ప్రభుత్వానికి పట్టదా ?

రాజ్‌పుత్‌ మహారాణి ‘పద్మావతి’ జీవిత కథ ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పద్మావతి’. దీపికా పదుకొణె ‘పద్మావతి’ పాత్రలో, షాహిద్‌ కపూర్‌ పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో, రణ్‌వీర్‌ సింగ్‌ రాజు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో నటించారు. ఈ సినిమా వివాదాల సుడిగుండాల్లో చిక్కుకుంది. ఈ సినిమా చుట్టూ లెక్కలేనన్ని వివాదాలు. విడుదలకు ముందే పద్మావతి’ చిత్రంపై రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిషేధం విధించారు.

ఈ సినిమాపై రాజ్ పుత్ ల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. ఈ సినిమా టైటిల్‌ పాత్రలో నటించిన దీపిక పదుకొణె తల నరికి తెస్తే రూ.5కోట్లు రివార్డు ఇస్తామంటూ కొందరు ప్రకటిస్తు భయామంధోళనకు గురి చేస్తున్నారు. ఈ వివాదాలు అన్నిటికీ కారణం.. ఈ సినిమాలో పద్మావతి చరిత్రను వక్రీకరించి చూపిస్తున్నారని రాజ్ పుత్ ల ప్రధాన ఆరోపణ. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. ఈ ఒక్క ఆరోపణకే ఈ సినిమా వస్తున్న నిరసనలపై ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు అక్షేపనీయంగా వుంది.

”మేము చరిత్రను వక్రీకరించలేదు. ఇందులో ఏదైనా తప్పు వుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ చూసుకుంటుందని” చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా వినడం లేదు. అసలు ఈ సినిమాని ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు. సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు వుంటే.. ప్రభుత్వం నియమించిన సెన్సార్ అడ్డుగా ఉటుంది. కానీ ఇవ్వన్నీ పక్కన పెట్టి ఈ సినిమాపై వస్తున్న నిరసనలు చూస్తుంటే షాకింగ్ వుంది.

మహిళా సాధికారత గురించి మాట్లాడుతూతున్న మోడీ సర్కార్.. ఒక ఆడ కూతురు తల నరికేయాలనే ప్రకటనలు ఎందుకు ఊపేక్షిస్తుందో అర్ధం కావడం లేదు. నిజంగా ఇది చాలా అందోళనకరమైన పరిస్థితి. ఈ విషయంలో ఇప్పటికే సినిమా యూనిట్ కేంద్ర ప్రభుత్వంని గోడును వినిపించింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. సినిమాలను నియత్రించడానికి సెన్సార్ అనే ఒక వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏదైనా అభ్యంతరం వుంటే వాళ్ళు చూసుకుంటారు అని ప్రభుత్వం తరపునుండి ఎవరూ ఒక మాట కూడా చెప్పడం లేదు. దిని అర్ధం ప్రభుత్వ వ్యవస్థలపై ప్రభుత్వనికే నమ్మకం లేదనా? లేదా సినిమా వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి అర్ధం కావడం లేదా? ఏమో.. ప్రభుత్వం తీరు చూస్తుంటే అలానే వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close