ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల్సిందే: జ‌య‌ప్ర‌ద‌

ఆమె మొన్న‌టి స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ సినిమాల్లో దుమ్ము లేపారు. తెర‌పై ఏకైక అంద‌గ‌త్తె అంటూ మృణాళ్‌సేన్ వంటి ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. క‌ట్ చేస్తే… ఆమె నిన్న‌టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజకీయ నాయ‌కురాలు. స‌మాజ్‌వాదీ పార్టీలో అమ‌ర్‌సింగ్ అండ‌తో ఓ వెలుగు వెలిగారు. మ‌రి నేడేమిటి? ఆమె ప్ర‌స్థానం ఎటు వైపు? అర‌వై ఏళ్ల వ‌య‌సులో… ఈ మాజీ స్టార్ హీరోయిన్‌ క‌మ్ పొలిటీషియ‌న్ కొత్త‌గా పోషించ‌బోతున్న పాత్ర ఎలాంటిది?

ప్ర‌స్తుతానికి రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు ఏమీ లేవు. వీలైన‌న్ని మంచి సినిమాల్లో న‌టించ‌డ‌మే ల‌క్ష్యం అని అంటున్నారు జ‌య‌ప్ర‌ద‌. తూర్పు గోదావ‌రి జిల్లాలోని మంద‌ప‌ల్లిలోని ఓ గుడిలో పూజ‌ల‌కు వ‌చ్చిన ఆమె… మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా… తాను రాజ‌కీయాల‌కు ప్ర‌స్తుతం స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌న్నారు. అయితే అంత మాత్రాన రాజ‌కీయాల‌కు దూరం కాబోన‌ని, ప్ర‌స్తుతానికి మాత్రం సినిమా న‌ట‌న‌కే త‌న ప్రాధాన్యం అని చెప్పారు. అంటే బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌ల ముందుగా ఆమె త‌న ప్ర‌స్థానాన్ని నిర్ణ‌యించుకోనున్నట్టు ఊహించ‌వ‌చ్చు. మ‌రైతే ఆమె ఏ పార్టీలో చేర‌నున్నారు?

నిజానికి ఆమెకు ఉన్న ఇమేజ్ తో… తెలుగుదేశం లేదా వైసీపీ లేదా మ‌రే పార్టీలోనైనా తేలిక‌గానే చోటు ద‌క్కించుకోవ‌చ్చు. అయితే ఆమె మాత్రం ఈ విష‌యంలో ఇంకా సందిగ్థంలోనే ఉన్న‌ట్టు క‌నిపించారు. చంద్ర‌బాబు పాల‌న బాగుంద‌ని కితాబు ఇచ్చారామె. ఓహో అయితే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నార‌న్న‌మాట అనుకోనివ్వ‌కుండా… చంద్ర‌బాబుకు ఏమాత్రం న‌చ్చ‌ని మాట అయిన‌… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక‌హోదా అవ‌స‌రం అంటూ స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంత‌గానో న‌ష్ట‌పోయిందంటున్న జ‌య‌ప్ర‌ద‌… ప్ర‌త్యేక‌హోదా ఇస్తేనే ఆ న‌ష్టం పూడుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఏదేమైనా… ఎన్నిక‌ల ముందు ప‌రిస్థితిని, ఇచ్చే ప్రాధాన్య‌త‌ల‌ను చేరే బ‌ట్టి పార్టీని నిర్ణ‌యించుకోవాల‌నే ఆలోచ‌న‌లో జ‌య‌ప్ర‌ద ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close