ఇక మెగాస్టార్‌ ఇలా సెటిల్‌ అవ్వబోతున్నాడా? . ఏంటి..?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించి ఆమధ్య మీడియా విపరీతంగా హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం చేస్తూనే వుంది . అతను మళ్ళీ సినిమా చెయ్యాలనే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడో లేదో తెలీదుగానీ మీడియా మాత్రం చాలా సీరియస్‌గా తీసుకొని డైరెక్టర్‌ ఎవరు, హీరోయిన్‌ ఎవరు వంటి విషయాల్ని కన్‌ఫర్మ్‌ చేసేసింది. అయితే చివరికి మంచి కథ, డైరెక్టర్‌ కుదిరితే తప్పకుండా 150వ సినిమా చేస్తానని, రామ్‌చరణ్‌ ఆ చిత్రాన్ని నిర్మిస్తాడని మెగాస్టార్‌ ప్రకటించాడు. ఆమధ్య పూరి జగన్నాథ్‌ డైరెక్టర్‌గా కన్‌ఫర్మ్‌ అయ్యాడని, ఫస్ట్‌ హాఫ్‌ కూడా ఓకే అయిందనే వార్తలు కూడా వచ్చాయి. చివరికి కథ నచ్చకపోవడం వల్ల పూరి జగన్నాథ్‌ని తప్పించారని తెలిసింది. తర్వాత వి.వి.వినాయక్‌ తెరపైకి వచ్చాడు. మెగాస్టార్‌ పుట్టినరోజైన ఆగస్ట్‌ 22న సినిమా ఎనౌన్స్‌ చేస్తారని అంతా ఎదురు చూశారు. కానీ, అక్కడ ఎలాంటి సౌండూ లేదు. దసరాకి మెగాస్టార్‌ శ్రీమతి సురేఖ 150వ సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్తుంది అన్నారు. అదీ జరగలేదు.

ఇదంతా చూస్తుంటే అసలు మెగాస్టార్‌కి మళ్ళీ హీరోగా నటించే ఆలోచన వుందా లేదా అనే డౌట్‌ అందరికీ కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల రామ్‌చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో మెగాస్టార్‌ నటించాడు. అయితే అది సినిమాకి ఉపయోగపడకపోగా మెగాస్టార్‌ గెటప్‌ని, పెర్‌ఫార్మెన్స్‌ని చూసిన అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. ఈ సినిమా తర్వాత 150వ సినిమా అనే టాపిక్‌ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో చిరంజీవి ఒక గెస్ట్‌ రోల్‌ చెయ్యబోతున్నాడని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే ఇక చిరంజీవి మిగిలిన తన సినీ జీవితాన్ని ఇలా గెస్ట్‌ రోల్స్‌ చేసుకుంటూ గడిపేస్తాడా? అనే డౌట్‌ కూడా వస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరి సినిమాలో ఇలా గెస్ట్‌ రోల్స్‌ చేసుకుంటూ వెళ్ళిపోతాడా? మెగాస్టార్‌ ఇక ఇలా సెటిల్‌ అవ్వాలని డిసైడ్‌ అయ్యాడా? అనే డౌట్‌ అభిమానులకు కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close