అనుష్క ఆకలి తీర్చేనా ?

సంక్రాంతి అంటే సినిమా పండగా కూడా. పెద్దా చిన్నా అని తేడా లేదు. సంక్రాంతి వస్తుందంటే.. ఓ అరడజను సినిమాలైనా థియేటర్ లోకి వచ్చేస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చినా సినిమా బావుంటే ఆదరించే గొప్ప ప్రేక్షకులు తెలుగులో వున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కూడా బడా మీడియం సినిమాలు థియేటర్ లోకి వరుసకట్టాయి. అయితే అసలైన సంక్రాంతి కళను ఏ సినిమా కూడా తీసుకురాలేకపోయిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో అజ్ఞాతవాసి ఈ సంక్రాంతికి వచ్చిన అత్యంత భారీ సినిమా. పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ .. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటేనే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ఈ విషయాన్ని ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ నిరూపించాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో మరోసారి తమ సత్తా చాటేందుకు వచ్చారు. ఈ సినిమాతో పండగ రెట్టింపు అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే తఫలితం అత్యంత నిరాశజనకంగా మారింది. పండగగా సదరాలను రెట్టింపు చేస్తుందనుకున్న ఈ సినిమా కాస్త దెబ్బ కొట్టేసింది.

నందమూరి బాలకృష్ణను సంక్రాంతి హీరో అంటారు. సంక్రాంతికి ఆయన సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ. ఈ సంక్రాంతికి కూడా రేసులో నిలబడ్డారు బాలయ్య జై సింహతో. అయితే ఈ సినిమా కూడా సంక్రాంతి ఆకలి తీర్చలేకపోయింది. బాలయ్య నటన మాట పక్కన పెడితే మరీ పాతకాలం రోడ్దకొట్టుడు సినిమాగా మారింది జైసింహ. బాలయ్య ఈసారి ఎమోషన్ గా గర్జించినా ఫలితం లేకపోయింది. వెరసి సంక్రాంతి ఫ్లాఫ్ ఫోల్డర్ లో చేరిపోయింది జై సింహా.

గ్యాంగ్ అంటూ ఓ సినిమాతో పలకరించాడు తమిళ స్టార్ సూర్య. ఇది అనువాద సినిమా. అందులోనూ హిందీ లో హిట్ అయిన స్పెషల్ 26కి రీమేక్. ఇప్పటికే ఆ హిందీ వెర్షన్ ని చాలా మంది చూసేశారు. అదే కధతో వచ్చిన గ్యాంగ్ కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. సంక్రాంతి దాహాన్ని తీర్చే సినిమా అయితే కాలేకపోయింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన మీడియం సినిమా రంగుల రాట్నం. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ.. చిత్రాలతో ప్రామెసింగ్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ హీరో కావడం, నాగార్జున నిర్మాణం కావడంతో ఈ సినిమాపై ఓ అంచనా ఏర్పడింది. కానీ తీరా సినిమా చూశాక .. ”ఇలాంటి సినిమాని నాగార్జున ఎలా నిర్మించాడ్రా బాబు”అంటూ తలలు పట్టుకున్నారు ప్రేక్షకులు. అంత నీరసంగా తిరిగిందీ రంగుల రాట్నం. మొత్తమ్మీద ఈ సంక్రాంతికి సినిమా కళ తప్పింది. అనవసరంగా కరుసైపోయింది.

మరి ఇప్పుడు ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమా ఏది అంటే ? ఈ నెలలోనే అనుష్క ‘భాగమతి’ కనిపిస్తుంది. అనుష్క అంటే లేడీ సూపర్ స్టార్. అరుధంతి తర్వాత ఆమె కెరీర్ మరో లెవల్ కి వెళ్ళింది. అనుష్క నుండి సినిమా వస్తుందంటే మంచి అంచనాలే వుంటాయి. ఇక యువీ క్రియేషన్ అంటే హిట్ సినిమాలకు పెట్టింది పేరు. ఆ నిర్మాణ సంస్థ నుండి వస్తున్న ఈ సినిమాపై కూడా చాలా పాజిటివ్ బజ్ వుంది. అందులోనూ దాదాపు నలఫై కోట్లు రూపాయిలు ఈ సినిమా కోసం ఖర్చు చేశారట. కేవలం అనుష్క స్టామినాను నమ్మి చేసిన ఖర్చు ఇది. ఇక భాగమతి ట్రైలర్ చూస్తుంటే.. విషయం వున్న సినిమానే అనిపిస్తుంది. ఈ సినిమాకి బాహుబలి క్రేజ్ కూడా కలిసొస్తుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత అనుష్క ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. దేవసేనగా అనుష్క ను చూసిన ప్రేక్షకులకు మళ్ళీ ఇప్పుడు భాగమతిగానే చూడబోతున్నారు. అనుష్క కెరీర్ సోలో సాలిడ్ హిట్ ఆరుధంతి. ఇప్పుడు ఆ మ్యాజిక్ భాగమతిలో కనిపిస్తే కనుక సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆకలి తీరినట్లే. మరి అనుష్క ఏం చెస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

పేరుకే పాతిక కోట్లు.. అంతా ఎగ్గొట్టేవారే!

పాపం... టాలీవుడ్ లో ఓ హీరో ప‌రిస్థితి చూస్తే జాలేస్తోంది. ఎలాంటి అండ దండ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి, స్టార్ గా ఎదిగిన హీరో అత‌ను. పారితోషికం మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూ, ఇప్పుడు పాతిక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close