రిపబ్లికన్, సి ఓటర్ సర్వే: తమిళనాట రజనీ, ఎపిలో వైసిపి ఆధిక్యం

2019 సాధారణ ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని రిపబ్లికన్ టీవీ, సి ఓటర్ ఒక సర్వే చేసింది. ప్రధానంగా పార్లమెంటు స్థానాల గురించి చేసిన ఈ సర్వే 2019 లో మళ్ళీ ఎన్‌డీయే అధికారం లోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఎపి లో వైసిపి కి, తలంగాణా లో టీఆరెస్ కి, తమిళ నాట రజనీ కి ఆధిక్యం ఉన్నట్టు చెప్పిది సర్వే.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బిజెపి ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమికి 335 సీట్ల వరకు రావచ్చని, యుపిఎ కి 89 స్థానాలు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 13, టిడిపి,బిజెపి కూటమికి 12 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. తెలంగాణలో టిఆర్ఎస్ కు 11, బిజెపికి 3, కాంగ్రెస్ కు 2, ఎమ్.ఐ.ఎమ్. 1 సీటు రావచ్చని సర్వే అంచనా వేసింది రిపబ్లికన్, సి ఓటర్ సర్వేలో తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగితే రజనీకాంత్ పార్టీకి 23 స్థానాలు రావచ్చని, డి.ఎమ్.కె.కి 14 సీట్లు రావచ్చని అంచనా వేశారు.అన్నా డి.ఎమ్.కె.కేవలం 2 సీట్లే వస్తాయని సర్వే అబిప్రాయపడింది.రజనీకాంత్ పోటీలో లేకపోతే డి.ఎమ్.కె.కి 32 సీట్లు, అన్నా డి.ఎమ్.కె. 6 సీట్లు, బిజెపి 1 సీటు రావచ్చని సర్వే అంచనా వేసింది.

రోజు రోజుకీ డైనమిక్ గా మారడం ప్రస్తుత పాలిటిక్స్ లో చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకి మూణ్ణెల్ల ముందు చేసిన సర్వేలు కూడా ఆ తర్వాతి పరిణామాల్లో మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సర్వే లు రాబోయే ఏడాది లో మరిన్ని రావడం, అందులో విభిన్నమైన ఫలితాలు రావడమూ ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close