లావ‌ణ్య త్రిపాఠీ ఫైన్ క‌ట్టిందా? లేదా?

ఈమ‌ధ్య లావ‌ణ్య త్రిపాఠీ కొద్ది పాటి ఇబ్బందుల్లో చిక్కుతుంది. తెలుగులో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన 100 % సినిమాని త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. క‌థానాయిక‌గా అవ‌కాశం లావ‌ణ్య త్రిపాఠీకి వ‌రించింది. కొన్ని రోజులు షూటింగ్ అవ్వ‌గానే ఈ టీమ్ నుంచి లావ‌ణ్య కావాల‌నే త‌ప్పుకుంది. దాంతో త‌మిళ నిర్మాత‌లు లావ‌ణ్య‌పై ఫైర్ అయ్యారు. ఆమెపై త‌మిళ నిర్మాత‌ల సంఘంలో ఫిర్యాదు చేశారు. ‘మా’ లోనూ ఆమెపై కంప్లైంట్ న‌మోద‌య్యింది. లావ‌ణ్య స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకుని, ఆమెపై రీషూట్లు చేయ‌డం వ‌ల్ల తాము చాలా న‌ష్ట‌పోయామ‌ని, అందుకు ప్ర‌తిగా రూ.2 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని త‌మిళ నిర్మాత డిమాండ్ చేశారు. లావ‌ణ్య కూడా కొంత మొత్తం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించింద‌ని వార్త‌లొచ్చాయి.

వీటిపై లావ‌ణ్య త్రిపాఠీ స్పందించింది. తానేం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌లేద‌ని, నిర్మాత‌తో కూర్చుని మాట్లాడుకుని శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది. ”రెండు కోట్లు, మూడు కోట్లు అని ఏవేవో వార్త‌లు రాశారు. నా పారితోషిక‌మే అంత ఉండ‌దు క‌దా. అలాంటిది అంత మొత్తం ఎలా చెల్లిస్తాను? ఆ వివాదం త‌ర‌వాత నేను నిర్మాత‌ని క‌లిశాను. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలాంటి గొడ‌వ‌లూ లేవు. నేను డ‌బ్బులేం ఇవ్వ‌లేదు” అని చెప్పేసింది లావ‌ణ్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి స్పెషల్‌ ఇన్వైటీగా రవి ప్రకాష్.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం విజయవాడ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,...

ద‌ర్శ‌న్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ ఇప్పుడు మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. స్వ‌యానా త‌న అభిమాని రేణుకా స్వామిని హ‌త్య చేసిన కేసులో ద‌ర్శ‌న్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుని ప్ర‌తిష్టాత్మ‌కంగా...

బాల‌య్య అనురాగం… ష‌ర్మిళ దౌర్బాగ్యం

ఈరోజు ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం అట్ట‌హాసంగా సాగింది. ఈ కార్య‌క్ర‌మంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన దృశ్యాలు చోటు చేసుకొన్నాయి. ప‌వ‌న్...

వైసీపీ క్యాడర్‌కు షర్మిల అండ

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ..వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన కలుగుతోంది. వాటిని ఆపాలని నేరగా చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ దాడులను ప్రస్తావించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close