నాగార్జున కోసం బాలీవుడ్ యాక్ష‌న్ టీమ్‌

రాంగోపాల్ వ‌ర్మ సినిమాల్లో యాక్ష‌న్ సీన్స్ కొత్త‌గా ఉంటాయి. ర‌క్త‌పాతం ఏమీ క‌నిపించ‌దు గానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. శివ నుంచి ఏ సినిమా తీసుకున్నా.. ఆయ‌న ఫైట్స్‌ల‌లో కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. స‌హ‌జంగా ఉంటుంది. ఇప్పుడూ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. నాగార్జున‌, వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అక్క‌డ యాక్ష‌న్ సీన్స్‌, ఓ ఛేజ్‌ని తెర‌కెక్కిస్తున్నారు. వీటికి బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ ఇజాజ్ షేక్ నేతృత్వం వహిస్తున్నారు. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కంపెనీ చిత్రానికి ఆయ‌నే కొరియోగ్రాఫ‌ర్‌. అక్ష‌య్ కుమార్‌ లాంటి యాక్ష‌న్ క‌థానాయ‌కుల‌కు ఆయ‌న ఆస్థాన ఫైట్ మాస్ట‌ర్‌. ప్ర‌స్తుతం నాగార్జున కోసం కొత్త త‌ర‌హా ఫైట్ల‌ని కంపోజ్ చేస్తున్నార్ట‌. అజ‌య్‌, షాయాజీ షిండేలు కూడా ఈ ఫైట్‌లో పాలుపంచుకుంటున్నారు. మార్చి 10 వ‌ర‌కూ ముంబైలోనే చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close