వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో రాజకీయాలను శాసించిన సజ్జల ఒకవేళ వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైతే సైలెంట్ అయిపోతారా..? వైసీపీతోపాటే ఉంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
సజ్జలకు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను చూసి మంత్రులు సైతం ఆయన్ను సీఎంతో సమానంగా ట్రీట్ చేస్తుంటారు. ఎవరిపైనైనా విమర్శలు చేయలంటే అందుకు సజ్జల అనుమతి తీసుకుంటారు. ఆయన నుంచి అప్రూవల్ వచ్చాకే మీడియా ముందు వాలిపోతారనే విమర్శలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై మొట్టమొదట వైసీపీ నుంచి సజ్జలే స్పందించి ఆమెపై విమర్శలు చేశారు. అధికారుల పోస్టింగ్ లు, బదిలీల విషయంలోనూ ఆయనదే కీ రోల్ అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వైసీపీ వ్యవహారాలన్నీ సజ్జల డైరక్షన్ లోనే కొనసాగుతాయనే ప్రచారానికి ఈ పరిణామాలు బలం చేకూర్చేవే.
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్న సజ్జల అనేకానేక అంశాల్లో తలదూర్చారు. కాని , వైసీపీ రెండోసారి పవర్ లోకి వచ్చే ఛాన్స్ లేదన్నది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం. అంచనాలే నిజమై వైసీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైతే సజ్జల రోల్ ఎలా ఉండనుంది..? అనునిత్యం జగన్ తోనే కలిసి సాగుతారా..? లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.