చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4… దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది. ఇప్పుడు ఈనెల 19న హైద‌రాబాద్ లోని ఎల్‌.బీ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఇదే వేదిక‌పై ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌లు కూడా కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌ద‌రు హీరోలంతా ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డానికి త‌మ అనుమ‌తి తెలిపార‌ని తెలుస్తోంది.

తెలుగు చిత్ర‌సీమ‌లోని ద‌ర్శ‌కులంతా ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోబోతున్నారు. ఓర‌కంగా ఇది చిత్ర‌సీమ చేస్తున్న అతి పెద్ద వేడుక‌. ఇప్ప‌టికే టికెట్ల అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. ఈమ‌ధ్య కాలంలో ఇంత పెద్ద ఈవెంట్ టాలీవుడ్ చేయ‌లేదు. ఈ కార్యక్ర‌మం ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని ద‌ర్శ‌కుల సంక్షేమం కోసం ఉప‌యోగించాల‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ఈ ఈవెంట్ స‌క్సెస్ అయితే ప్ర‌తీ యేటా ఇలాంటి ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారంతా. ‘మా’ కూడా ఇలాంటి ఓ ఈవెంట్ నిర్వ‌హించే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఆ ఈవెంట్ ద్వారా వ‌చ్చే ఆదాయంతో ‘మా’ బిల్డింగ్ ప‌నులు పూర్తి చేయాల‌నుకొంటున్నారు. ‘మా’ ఈవెంట్ కు ద‌ర్శ‌కుల సంఘం చేసే ఈ కార్య‌క్ర‌మం ఓ రిహార్స‌ల్ లా ఉప‌యోగ‌ప‌డొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close