సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌కటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. నిజానికి ఈ క‌థ సూర్య‌, కార్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. వారిద్ద‌రూ తండ్రీ కొడుకులుగా చేయాల్సిన సినిమా ఇది. క‌థ కూడా వారిద్ద‌రికీ న‌చ్చింది. కానీ.. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌, `నో` చెప్పార‌ని స‌మాచారం. ఇప్పుడు అదే క‌థ విజ‌య్ ద‌గ్గ‌ర‌కు చేరింది. అయితే ఈసారి తండ్రీ కొడుకులుగా రెండు పాత్ర‌లూ విజ‌య్ నే పోషించ‌నుండ‌డం విశేషం. అయితే సూర్య‌, కార్తిల ఇమేజ్ వేరు, విజ‌య్ ఇమేజ్ వేరు. దానికి త‌గ్గ‌ట్టే రాహుల్ కూడా క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక ఫిక్స‌యింది. విజ‌య్ – ర‌ష్మిక‌ల కాంబోలో రూపుదిద్దుకొంటున్న 3వ చిత్ర‌మిది. గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా పూర్త‌యిన వెంట‌నే… రాహుల్ సంకృత్య‌న్ పిరియాడిక‌ల్ డ్రామా సెట్స్ పైకి వెళ్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close