నాని సినిమా హాలీవుడ్ కి కాపీనా??

నాని నిర్మాత‌గా మారిన ‘అ’పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌చార చిత్రం ఆక‌ట్టుకుంది. దాంతో పాటు స్టార్ కాస్ట్ కూడా గ‌ట్టిగానే ఉంది. నాని నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ నిర్మాత‌గా మారాడంటే ఆ ఆస‌క్తి రెట్టింపు అవుతుంది. ‘అ’ క‌థ‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి క్లూ లేదు. ఏడెనిమిది క‌థ‌ల‌ను గొలుసుక‌ట్టుగా మార్చి.. ఒక్కో క‌థ చెబుతూ వెళ్తారు. చివ‌రికి ఆ క‌థ‌ల‌న్నీ ఒకే చోట చేరుతాయ‌న్న‌ది కాన్సెప్ట్‌.

అయితే ఇదో హాలీవుడ్ సినిమాకి కాపీ అని తెలుస్తోంది. 2007లో ‘రాట‌టూలి’ అనే యానిమేష‌న్ సినిమా వ‌చ్చింది. ఆ క‌థ ఇంచుమించుగా ఒక్క‌టే అని టాక్‌. ఓ రెస్టారెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా అది. అందులో వంట వాడికి వంట బొత్తిగా రాదు. ఆ రెస్టారెంట్లో తిరిగే ఎలుక‌… ఆ వంట‌వాడికి స‌ల‌హాలు ఇస్తుంటుంది. దాని మాట‌లు వింటూ… వంట చేస్తుంటాడు. అదో సెప‌రేట్ ట్రాక్‌. రెస్టారెంట్ నేప‌థ్యంలో స‌మాంత‌రంగా కొన్ని క‌థలు జ‌రుగుతుంటాయి. చివ‌రికి అవ‌న్నీ ఓకే చోట చేర‌తాయి. ‘అ’లోనూ అంతే. ఇందులో ఎలుక బ‌దులుగా చేప‌ని తీసుకొచ్చారు. ఎక్వేరియంలో ఉన్న చేప‌.. వంట‌వాడితో మాట్లాడ‌డ‌మే ఈ క‌థ స్పెషాలిటీ. అంటే.. నాని కూడా చివ‌రాఖ‌రికి హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టేశాడ‌న్న‌మాట‌. ‘అజ్ఞాత‌వాసి’ విష‌యంలోనే నిర్మాత‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రి నాని విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close