దిశా పటాని దశ మార్చిన బాలీవుడ్ సినిమా…!

మోడల్‌గా ఎంటర్‌ అయి 2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఫస్ట్‌ రన్నర్‌ అప్‌గా ఎంపికై, డెయిరీ మిల్క్‌ యాడ్‌తో లక్షల మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న బ్యూటీ దిశా పటాని. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించని దిశా ఫస్ట్‌ టైమ్‌ ‘లోఫర్‌’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ని యూనిట్‌ అంతా అప్రిషియేట్‌ చేశారు. దిశా పెద్ద హీరోయిన్‌ అయిపోతుందని అంతా అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్‌ అయిన తర్వాత సినిమాలో ఆమె క్యారెక్టర్‌ గురించిగానీ, ఆమె పెర్‌ఫార్మెన్స్‌ గురించిగానీ ఎవరూ మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజ్‌ అయి నెల దాటుతున్నా టాలీవుడ్‌లోగానీ, కోలీవుడ్‌లోగానీ ఏ సినిమాలోనూ ఆమెను బుక్‌ చేసుకోలేదు. ‘లోఫర్‌’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా తన దశ మార్చలేకపోయిందని తెగ ఫీల్‌ అయిపోతోందట దిశా.

మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ, పూరికి మాత్రం ఆమెలో మంచి పెర్‌ఫార్మర్‌ కనిపించిందట. అందుకే ఏరి కోరి ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకున్నాడు. ఇప్పుడు దిశా ఒక బాలీవుడ్‌ సినిమాకి సైన్‌ చేసిందట. నీరజ్‌ పాండే దర్శకత్వంలో ఎం.ఎస్‌.ధోని జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘ఎం.ఎస్‌.ధోని’ చిత్రంలో ధోనీ మాజీ ప్రియరాలుగా నటించబోతోంది దిశా. మరి ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌ దర్శకనిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకోవాలి అనుకుంటోంది దిశా పటాని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close