హోదా కోసం ప‌వ‌న్ పోరాటం ఎవ‌రిపై ఉంటుంది..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య ఏపీ ప్ర‌త్యేక హోదాపై గంద‌ర‌గోళ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ స‌భ నుంచి ఆయ‌న అధికార పార్టీపై విమ‌ర్శ‌లు పెంచిన సంగ‌తీ తెలిసిందే. తాజాగా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి, భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా లేఖ రాశారు క‌దా! అమిత్ షా లేఖ‌తోపాటు, దానిపై ముఖ్య‌మంత్రి స్పందించిన తీరుపై కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు మాట‌లు చూస్తుంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదాను భాజ‌పా ఎప్ప‌టికీ ఇవ్వ‌ద‌నేది అర్థ‌మౌతోంద‌న్నారు. దాన్ని సాధించే స్థితిలో తెలుగుదేశం లేద‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌ని చెప్పారు.

ఆంధ్రాకు చాలా ఇచ్చామ‌నీ, ఖ‌ర్చు చేయ‌డంలో టీడీపీ విఫ‌ల‌మైంద‌ని అమిత్ షా మ‌ళ్లీ పాతపాటే పాడారు అన్నారు. కేంద్రం ఎంత ఇచ్చిందో, రాష్ట్రం ఎంత ఖ‌ర్చు చేసిందో తేల్చ‌డానికి అధికారుల‌ను క‌మిటీగా వేసి ప్ర‌జ‌ల‌కు లెక్క‌లు చెప్పొచ్చు క‌దా అని స‌ల‌హా ఇచ్చారు. జ‌న‌సేన ఇటీవ‌ల త‌యారు చేసిన జె.ఎఫ్‌.సి. నివేదిక‌తో కేంద్రాన్ని రాష్ట్రం ప్ర‌శ్నించొచ్చు క‌దా అన్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే విసిగిపోయి ఉన్నార‌నీ, వారిని రోడ్ల మీద‌కు తీసుకొచ్చి ఆందోళ‌న‌లు చేసే ప‌రిస్థితి తీసుకుని రావొద్ద‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరుతున్న‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌, మ‌రొక‌టి వినే స్థితిలో లేర‌ని ప్ర‌భుత్వాలు గుర్తించాల‌న్నారు. ప్ర‌స్తుత రాష్ట్ర ప‌రిస్థితిపై త్వ‌ర‌లోనే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ వంటివారితో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇన్నాళ్ల‌కి, ప్ర‌త్యేక హోదా త‌ప్ప ప్ర‌జ‌లు మ‌రొక‌టి వినేలా లేర‌నేది ప‌వ‌న్ అర్థ‌మైన‌ట్టుంది..!

ఇప్ప‌టికీ ప‌వ‌న్ రాని స్ప‌ష్ట‌త ఏంటంటే… ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఎలా ముందుకు వెళ్లాల‌నేది మ‌రోసారి చ‌ర్చిస్తా అన‌డం. జేపీ లాంటి మేధావుల్ని మ‌ళ్లీ ర‌మ్మంటాన‌న‌డం. నిజ నిర్ధార‌ణ క‌మిటీ అంటే ఓసారి వారు వ‌చ్చారు. లెక్క‌లు తేల్చి ఇచ్చారు. ఆ నివేదిక అందిన వెంట‌నే త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉంటుందని అప్ప‌ట్టో ప‌వ‌న్ చెప్పారు. త‌రువాత‌, అలాంటిందేమీ లేదు. ఇప్పుడు మ‌ళ్లీ చ‌ర్చించాకే కార్యాచ‌ర‌ణ అంటున్నారు. జ‌న‌సేనాని అంటున్న చ‌ర్చ‌లు ఉంటాయి.. కానీ, ఆ త‌రువాత కార్యాచ‌ర‌ణ అనేదే ప్ర‌తీసారీ ప్ర‌శ్నార్థంగా మిగిలిపోతూ ఉంటుంది. ఇంత‌కీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌న‌సేన కార్యాచ‌ర‌ణ అంటే ఎలా ఉంటుంది..? అవ‌స‌ర‌మైతే నిరాహార దీక్ష అని ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు క‌దా! అలాంట‌ప్పుడు మ‌ళ్లీ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు అంటారు ఎందుకూ..? ఇక‌పై జ‌న‌సేన పోరాటం.. హోదా సాధించలేదని ఆయనే విమర్శిస్తున్న టీడీపీపై ఉంటుందా, భాజ‌పా హోదా ఇవ్వ‌ద‌నే విష‌యం చంద్ర‌బాబు మాట‌ల ద్వారా అర్థం చేసుకున్నారు కాబ‌ట్టి, భాజ‌పాపై ఉంటుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close