బిగ్ బాస్ గా మ‌ళ్లీ ఎన్టీఆరే!

బిగ్ బాస్ షోతో త‌న‌లో టాలెంట్‌ని ఓ కొత్త రూపంలో ప్ర‌ద‌ర్శించాడు ఎన్టీఆర్‌. ఈ బుడ్డోడి వ్యాఖ్యానంతో.. తెలుగులో బిగ్ బాస్ షోకి విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజ‌న్ మొద‌ల‌వ్వ‌బోతోంది. ఈసారి మాత్రం ఎన్టీఆర్ వ్యాఖ్యానానికి దూర‌మ‌య్యాడు. దానికి కార‌ణం త‌న బిజీ షెడ్యూలే. త్రివిక్ర‌మ్ సినిమాని వీలైనంత తొంద‌ర‌గా ముగించాల‌న్న త‌ప‌న‌తో ఉన్న ఎన్టీఆర్‌…. బిగ్ బాస్ 2 కి అందుబాటులో ఉండ‌న‌ని చెప్పేశాడు. ఎన్టీఆర్ స్థానంలో నాని వ్యాఖ్యాత‌గా మార‌బోతున్నాడు. ఇందుకు సంబంధించి `స్టార్ మా`తో నాని ఎగ్రిమెంట్లు చేసుకోవాల్సివుంది. అయితే… నాని వ్యాఖ్యానం ఈ ఒక్క సీజ‌న్‌కి మాత్ర‌మే. మూడో సీజ‌న్‌లో.. మ‌ళ్లీ ఎన్టీఆరే ప‌గ్గాలు తీసుకుంటాడ‌ని, ఎన్టీఆర్ స‌న్నిహితులు చెబుతున్నారు. కేవ‌లం షూటింగ్ బిజీతో.. ఈ సీజ‌న్‌కి అందుబాటులో ఉండ‌డం లేద‌ని, బిగ్ బాస్ 3లో మాత్రం ఎన్టీఆర్ త‌ప్ప‌క క‌నిపిస్తాడ‌ని మా టీవీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. సో.. బిగ్ బాస్ గా మ‌ళ్లీ ఎన్టీఆర్‌ని చూడొచ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close