‘మా’ తొంద‌ర‌పాటే… కొంప‌ముంచుతోందా?

శ్రీ‌రెడ్డి విష‌యంలో ‘మా’ ప్ర‌వ‌ర్తించిన తీరు చిత్ర‌సీమ‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. `మేం నీకు స‌భ్య‌త్వం ఇవ్వం… మేం ఎవ్వ‌రం న‌టించం` అంటూ ఓ ప్రెస్ మీట్లో మా తేల్చిచెప్పేసింది. ఎప్పుడైతే మా త‌ర‌పున త‌లుపులు మూసుకుపోయాయో… అప్పుడు శ్రీ‌రెడ్డి మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం ప్రారంభించింది. ద‌గ్గుబాటి అభిరామ్ పేరు బ‌య‌ట‌పెట్టి, ఇంకా త‌న ద‌గ్గ‌ర పెద్ద లిస్టే ఉంద‌ని హెచ్చరిక‌లు జారీ చేసింది. `మా` వైఖ‌రి వ‌ల్లే… శ్రీ‌రెడ్డిపై సానుభూతి ఎక్కువైంద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. అప్ప‌టి వ‌ర‌కూ.. శ్రీ‌రెడ్డి అంటే లైట్ తీసుకున్న‌వాళ్లు కూడా `పాపం.. ` అనే స్థాయికి తీసుకొచ్చింది `మా`. టీవీ 9 చ‌ర్చావేదిక‌లో శ్రీ‌రెడ్డి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం, లైవ్ డిస్క‌ర్ష‌న్‌లో శ్రీ‌దేవి త‌ల్లి కూడా త‌న గొంతు వినిపించ‌డంతో – శ్రీ‌రెడ్డిపై సానుభూతి ప‌వ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

బాణాలు త‌మ‌వైపు దూసుకొస్తున్నాయి అని తెలుసుకున్న `మా`… ఆ త‌ర‌వాత వెన‌క‌డుగు వేసింది. వెంట‌నే ఓ ప్రెస్ మీట్ పెట్టి… శ్రీ‌రెడ్డిపై నిషేధం ఎత్తి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆరోజు ప్రెస్‌మీట్లో మా వైఖ‌రి కూడా ఆశ్చ‌ర్యం క‌లిగించింది. పాత్రికేయులు ప్ర‌శ్న‌లు లేన‌నెత్తితే.. స‌మాధానం చెప్ప‌డానికి కూడా ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదు. జెమిని కిర‌ణ్ అయితే.. ప్రెస్ మీట్లోంచి అర్థాంత‌రంగా లేచి వెళ్లిపోయారు. `మేం చెప్ప‌డానికే వ‌చ్చాం.. బ‌దులు ఇవ్వ‌డానికి కాదు` అన్న‌ట్టు సాగింది ఆ ప్రెస్ మీట్‌. `మా` ఏర్పాటు చేసిన రెండు ప్రెస్ మీట్లూ ప‌రిశ్ర‌మ‌కు త‌ప్పుడు సంకేతాల‌ను అందించిన‌దే. నాలుగ్గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకోవాల్సిన విష‌యాలు బ‌జారుకొచ్చాయంటే అందులో `మా` మొండివైఖ‌రి. తొంద‌ర‌పాటు కూడా ఉన్నాయి. ఈ విష‌యంలో శివాజీరాజా ఒక్క‌డినీ నిందించ‌డం క‌రెక్ట్ కాదు. `మా` తీసుకొన్న స‌మిష్టి నిర్ణ‌యం అది. రెండో ప్రెస్ మీట్ త‌ర‌వాత కూడా శ్రీ‌రెడ్డి త‌న జోరు త‌గ్గించ‌లేదు. త‌గ్గిస్తుంద‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. ఇప్పుడు శ్రీ‌రెడ్డి దూసుకుపోవ‌డానికి, చొచ్చుకుపోవ‌డానికి, ప‌రిశ్ర‌మ‌పై త‌న‌కున్న కోపాన్నంతా తీర్చేసుకోవ‌డానికి మ‌రిన్ని దారులు చూపించిన‌ట్టైంది. మ‌రి ఈ ర‌చ్చ‌.. ఎంత‌మందిని రోడ్డుకీడుస్తుందో, ఎప్పుడు శాంతిస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close