విక్టరీ & మెగా ప్రిన్స్… ముహూర్తం ఫిక్స్!

మల్టీస్టారర్ సిన్మాలకు బ్రాండ్ అంబాసిడర్ ‘విక్టరీ’ వెంకటేష్… మెగా ఫ్యామిలీ మెంబర్, అభిమానులు ముద్దుగా ‘మెగా ప్రిన్స్’ అని పిలిచే హీరో వరుణ్ తేజ్ కలిసి నటించనున్న సినిమా ‘ఎఫ్2’. ఫన్ & ఫ్రస్టేషన్… అనేది ఉపశీర్షిక. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముహూర్తం సిద్ధమైంది. జూన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అతని దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారధ్యంలో సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’, ‘రాజా.. ది గ్రేట్’ సినిమాలకు నిర్మాత ‘దిల్’ రాజే. దర్శక నిర్మాతల కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రమిది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. తాజాగా ఇద్దరు హీరోలకు దర్శకుడు ఫైనల్ వెర్షన్ వినిపించగా, ఇద్దరూ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close