మహిళకు బెదిరింపులు… ‘కత్తి’కి అండగా టీవీ9?

మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్నామని ప్రగల్భాలు పలుకుతోన్న టీవీ9కి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చింది సునీత అనే మహిళ. ‘కాస్టింగ్ కౌచ్’ సమస్యలు ఎదుర్కొన్న మహిళలు, నటీమణులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలనీ, టీవీల్లో కూర్చుని చర్చలు నిర్వహించడం వల్ల వాళ్లకు టీఆర్పీలు తప్ప పెద్ద ఉపయోగం లేదని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ చేసిన సూచనపై నిన్న మధ్యాహ్నం టీవీ9 ఒక చర్చ చేపట్టింది. పవన్ పేరు చెబితే ఎప్పుడూ ముందుండే కత్తి మహేశ్ అందులో పాల్గొన్నారు. అదే చర్చలో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఏకంగా టీవీ9, కత్తి మహేశ్‌ల‌పై విమర్శలు చేసింది.

సుమారు ఏడాది కిందట కత్తిని కలవడానికి ఆయన ఇంటికి వెళితే బలాత్కారం చేయబోయాడని, నేను ప్రతిఘటిస్తే 500 ఇచ్చి పంపించేశాడని సునీత ఆరోపించారు. అంతే కాదు… ఈ విషయం చెప్పడానికి మీ (టీవీ9) దగ్గరకు వస్తే పట్టించుకోలేదని… పోలీసుల దగ్గరకు వెళితే మీడియా కత్తికి అండగా ఉన్న కారణంగా మేమేం చేయలేమని చెప్పారని ఆమె పేర్కొంది. టీవీ9లో కూర్చుని అదే ఛానల్‌పై, అదే ఛానల్‌లో నిత్యం కనిపించే మహేశ్ కత్తిపై విమర్శలు చేయడం సదరు ఛాన‌ల్‌కి మింగుడు పడడం లేదు. టీవీ9 సెల్ఫ్ గోల్‌లో పడినట్లు అయ్యింది.

అంతకు మించిన హైలైట్ ఏంటంటే… ఈ రోజు సోషల్ మీడియాలో సునీత చేసిన ఆరోపణలు. కత్తికి అండగా టీవీ9 జనాలు నన్ను బెదిరిస్తున్నారని సోషల్ మీడియాలో సునీత కన్నీటి పర్యంతమైంది. “టీవీ9లో నేను చెప్పిందంతా నిజమే. నాకూ, కత్తికి మధ్య జరిగిన విషయాలే చెప్పాను. వాళ్లు లీగల్‌గా వెళ్లమని అనడంతో సరేనని చెప్పా. నేను ఎక్కడ కేసు పెడతానో అని రాత్రి ‘మహా న్యూస్’లో నా గురించి చెత్త చెత్తగా చెప్పించారు. టీవీ9 రిపోర్టర్ కాల్ చేసి, ఆధారాలు తీసుకురమ్మని బెదిరిస్తున్నారు. మహేశ్ కత్తి కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నేను టీవీ9కి వస్తానని అనలేదు. వాళ్లే పిలిచారు. మహేశ్ కత్తి విషయంలోనూ జరిగింది చెప్పా. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు. మహేశ్ కత్తికి టీవీ9 ఇంత సపోర్ట్ ఇస్తుందని నాకు తెలీదు” అని సునీత సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టీవీ9 క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే టాపిక్ ఇది. సినిమా ఇండస్ట్రీపై జూనియర్ ఆర్టిస్టులు, నటీమణులు చేసిన ఆరోపణలపై గంటల తరబడి చర్చలు నిర్వహిస్తున్న టీవీ9, సునీత ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close