గ్రేవ్ యార్డులో బ్యాంకింగ్..! కోలుకునే చాన్సులున్నాయా..?

ఒకప్పుడు ప్రజల అకౌంట్లో డబ్బులు ఉండేవి కావు. కానీ ఏటీఎంల్లో బ్యాంకుల్లో మాత్రం కొరత అనే మాటే వినిపించేది కాదు. ఇప్పుడు ప్రజల అకౌంట్లలో డబ్బులున్నాయి. కానీ బ్యాంకుల్లో మాత్రం లేవు. ఏటీఎంలలోనూ కనిపించడం లేదు. ప్రజల అకౌంట్లలో డబ్బులు ఉండటమంటే.. అకస్మాత్ గా ధనవంతులయ్యారని కాదు…చేతిలో ఒక్క రూపాయి ఉన్నా.. అది బ్లాక్ మనీనేన్నట్లుగా..కేంద్రం బలవంతంగా… ఉన్న నగుదు మొత్తాన్ని బలవంతంగా బ్యాంకులకు తరలించింది. ఆ డబ్బును రోజువారీ వాడకానికి తిగివ్వడానికి కూడా బ్యాంకులు సతాయిస్తున్నాయి. లక్షల సొమ్ము ఖాతాలో ఉన్నా.. రెండు వేల రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు సతాయిస్తున్నాయి. రోజువారీ ఖర్చుల కోసం ఏటీఎంలలో నగదు నింపడం లేదు.

అదే సమయంలో… బ్యాంకింగ్ సేవలకు రుసుముల పేరుతో బ్యాంకులు.. ఖాతాల్లో ఉన్న సొమ్మును కొద్దికొద్దిగా తినేస్తున్నాయి. ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ కొనసాగించే ఖాతాదారులకు బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపైనా సర్వీస్‌ టాక్స్‌ వసూలు చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అదీ కూడా.. ఐదేళ్ల కిందటి నాటి నుంచి లెక్క తీసి పిండుకుంటారట. అటు బ్యాంకులతో పాటు ఇప్పుడు కేంద్రం కూడా.. బ్యాంకు ఖాతాదారులను దోచుకోవడానికే చూస్తోంది.

ప్రస్తుతం భారతదేశ బ్యాంకింగ్ రంగం.. దివాలా అంచున నిలుచుకుంది. ఓ వైపు ప్రభుత్వ విధానాలతో.. ప్రజలు బ్యాంకింగ్ రంగంపై నమ్మకం కోల్పోయారు. మరో వైపు… వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి… డిఫాల్టర్లు పారిపోతున్నారు. బ్యాంకుల్లో సొమ్ము ఉన్నా…. అడిగితే తిరిగి ఇస్తున్న దాఖలాలు పెద్దగా లేవు. అందుకే ప్రజలు… తమ ఫిక్సుడ్ డిపాజిట్లను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. 60 సంవత్సరాల క్రితం భారత్‌లో బ్యాంకింగ్‌ సేవలు మొదలైన కొత్తల్లో బ్యాంకులపై ప్రజలకు సదాభిప్రాయం ఉండేది కాదు..! బ్యాంకుల్లో సొమ్ములు దాచుకోవాలంటే భయపడేవారు..! ఎందుకంటే..తాము కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులు తినేస్తాయనే భయం…! . తర్వాతి కాలంలో.. బ్యాంకులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. బ్యాంకుల ద్వారానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవడం పెరిగింది. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాల కారణంగా.. బ్యాంకులకు ఇంత కాలం పోగేసుకున్న నమ్మకాన్ని నిలువునా పోగొట్టుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో… రోజుకో బడా వ్యాపారి వందలు, వేల కోట్ల రూపాయలను రుణాలను తీసుకుని ఎగ్గొట్టి పారిపోయారు. విజయ్ మాల్యా కావొచ్చు..నీరవ్ మోదీ కావొచ్చు. ..రొటోమాక్ కొఠారి.. టోటెం ఇన్ ఫ్రా.. ఆదానీ.. ఇలా చెప్పుకుంటూ.. పోతే… ఎవరూ సరైన ఆస్తులు తనఖా పెట్టకుండానే వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. అందరూ ఎగ్గొట్టారు. కట్టే అవకాశం కూడా లేదు. ఈ సొమ్ము అంతా ఎవరిది.. ప్రజల డిపాజిట్లేగా. మళ్లీ ప్రజల దగ్గర నుంచి పిండాల్సిందేగా..! ఇంతటి అస్తవ్యస్థమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇంతకు ముందెన్నడూ లేదు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ గ్రేవ్ యార్డులో ఉన్నట్లే.! కోలుకోవడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close