టాలీవుడ్‌కి చిరంజీవి దిశానిర్దేశం చేయ‌గ‌ల‌డా?

దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణంతో… చిత్ర‌సీమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఏ స‌మ‌స్య వ‌చ్చినా `నేనున్నా` అంటూ ముందుకొచ్చి ఆ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌డంలో దాస‌రి దిట్ట‌. ఆయ‌న మాటంటే చిత్ర‌సీమ‌కూ అంత గురి ఉండేది. ఇప్పుడు ఆయ‌న లేరు. కానీ ప‌రిశ్ర‌మ చుట్టూ బోలెడు స‌మ‌స్య‌లు పేరుకుపోయాయి. వాటిని చ‌క్క‌దిద్దే నాధుడు లేక‌.. టాలీవుడ్‌లో ఎవ‌రికి తోచిన కామెంట్లు వాళ్లు చేస్తూ… ఆయా స‌మ‌స్య‌ల్ని మ‌రింత జ‌టిలం చేసేశారు. ఆ ద‌శ‌లో.. చిరంజీవి రంగ ప్ర‌వేశం చేశారు. గ‌డిచిన నాలుగు రోజుల నుంచీ టాలీవుడ్‌లో విస్క్రృత స్థాయి స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. వాటికి నాయ‌త్వం వ‌హిస్తున్న‌ది చిరంజీవే. అగ్ర క‌థానాయ‌కులు అని చెప్ప‌బ‌డే నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌ల‌తో పోలిస్తే చిరంజీవి చాలా సీరియ‌ర్‌. పైగా ఆయ‌న క్రేజ్ ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. ఏ విష‌యంలోనైనా సునిశిత దృష్టి.. లోతైన ఆలోచ‌నా విధానం… ఆయ‌న‌లో క‌నిపించే ల‌క్ష‌ణాలు. ప‌రిశ్ర‌మ‌లో చాలామందికి చిరంజీవినే ఆద‌ర్శ‌నం. ఆయ‌న అనుచ‌రులు, అభిమానులు ఎక్కువ‌గానే క‌నిపిస్తారు. పైగా మెగా కాంపౌండ్‌లో ఉన్న హీరోల‌కు, ఆ కాంపౌండ్ అంటే ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల సంఖ్య‌కు లెక్క‌లేదు. కాబ‌ట్టి.. చిరంజీవి `పెద్ద‌రికాన్ని` గౌర‌వించాల్సిందే. చిత్ర‌సీమ క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు చిరంజీవి తానంత‌ట తాను ముందుకొచ్చి.. దారిలో పెట్టాల‌ని చూడ‌డం, అందుకు సంబంధించి ఇలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌డం హ‌ర్షించ‌ద‌గిన ప‌రిణామ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అన్ని స‌మావేశాలూ.. చిరంజీవి దిశానిర్దేశంలో జ‌రిగిన‌వే. చిరంజీవి స‌ల‌హాలూ, సూచ‌న‌లూ బాగానే ప‌నిచేస్తున్నాయ‌న్న‌ది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల మాట‌.

నాగార్జున‌, వెంక‌టేష్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌లాంటి క‌థానాయ‌కుల‌కు చిరంజీవి మాట‌పై గురి ఉంది. వాళ్లెవ్వ‌రూ `నో` చెప్పే ఛాన్స్ లేదు. కాక‌పోతే.. బాలకృష్ణ చిరంజీవి పెద్ద‌రికాన్ని గౌర‌విస్తాడా, లేదా? అనేదే కాస్త ఆస‌క్తి క‌లిగించే విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన సినీ స‌మావేశాల‌కు ఆయ‌న రాక‌పోవ‌డం కూడా ఆస‌క్తి క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతానికి చిత్ర‌సీమ‌కు ఓ నాయ‌కుడు, పెద్ద దిక్కు కావాలి. ఆ బాధ్య‌త చిరంజీవి తీసుకున్నాడు. చిరు మాట‌పై న‌మ్మ‌కంతో.. ప‌రిశ్ర‌మ కూడా ఆయ‌న వెంటే ఉంది. ఫ‌లితాలు ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చేస్తాయ‌ని ఆశించ‌డం భావ్యం కాదు.కాక‌పోతే చిరు ఎఫెక్ట్ బ‌లంగానే క‌నిపించే అవ‌కాశం ఉంది. ఈ స‌మస్య‌ని చిరు స్మూత్‌గా డీల్ చేయ‌గ‌లిగితే… దాస‌రి లేని లోటుని చిరు కొంత వ‌ర‌కూ తీర్చ‌గ‌ల‌డ‌న్న భ‌రోసా మాత్రం క‌లుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close