అవినీతి లేనిది సినీ ప‌రిశ్ర‌మ‌లోనే: రామ్‌చ‌ర‌ణ్‌

చిత్ర‌సీమ Vs మీడియా… ప్ర‌స్తుతం వీటి మ‌ధ్యే పోరు. మీరెంత‌, అంటే మీరెంత‌? అనుకుంటూ ఈ రెండు ప‌రిశ్ర‌మ‌లూ కాలు దువ్వుతున్నాయి. ఆడియో ఫంక్ష‌న్ల‌లోనూ… వీటి గురించే చ‌ర్చ‌. ఇప్పుడు `నా పేరు సూర్య‌` ఆడ‌దియో వేడుక‌లోనూ ఇదే హాట్ టాపిక్ అయ్యింది. రామ్ చ‌ర‌ణ్ స్పీచ్‌లో మీడియాకు కొన్ని చుర‌క‌లు త‌గిలాయి. అవినీతి లేని పరిశ్ర‌మ ఒక్క సినిమా ప‌రిశ్ర‌మే అని, అలాంటి చిత్ర‌సీమ‌ని ప‌ట్టుకుని మీడియా ఏదేదో రాస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు చ‌ర‌ణ్‌. ప‌గ‌ల‌న‌క, రాత్ర‌న‌క క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తామ‌ని, షూటింగుల్లో ఒళ్లు హూనం చేసుకుంటామ‌ని, ఒక్కోసారి దెబ్బ‌లు కూడా త‌గులుతాయ‌ని, ప్ర‌భాస్, బ‌న్నీ, మ‌హేష్‌, ఎన్టీఆర్ ఇలా ఎన్నోసార్లు షూటింగ్‌లో దెబ్బ‌లు త‌గిలించుకున్నార‌ని గుర్తు చేశాడు చ‌ర‌ణ్‌. ”మా నాన్న బాల‌కృష్ణ గారు కూడా అనేక సార్లు దెబ్బలు త‌గిలించుకున్నారు. ఏ అర్థ‌రాత్రో ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్లాక కూడా సినిమా గురించే ఆలోచిస్తాం. ఓ గంట కూడా కుటుంబంతో గ‌ప‌డ‌ప‌లేం. ఇదంతా అభిమానుల‌కు తెలుసు” అంటూ త‌న ఆవేశాన్ని వెళ్ల‌గ‌క్కాడు రామ్‌చ‌ర‌ణ్‌.

‘నా పేరు సూర్య‌’ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన చ‌ర‌ణ్‌.. చిత్ర‌బృందానికి త‌న శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. చిరుత‌కు ముందు డాన్స్ విష‌యంలో త‌న‌కు ధైర్యం చెప్పింది బ‌న్నీనే అని, బ‌న్నీ హార్డ్ వ‌ర్క్ త‌న‌కు తెలుస‌న్నాడు చ‌ర‌ణ్‌. గోన గ‌న్నారెడ్డి లాంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్ర‌లు బాగా చేస్తాడ‌ని, ఆ పాత్ర‌కు అవార్డులు వ‌చ్చాయ‌ని, ఈ సినిమాకీ అవార్డులు రావ‌డం గ్యారెంటీ అన్నాడు. వాస్త‌విక‌త‌, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు త‌మిళంలో ఎక్కువ‌గా వ‌చ్చేవ‌ని, అందుకే త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌నుకునేవాళ్ల‌మ‌ని, అయితే యేడాది కాలంలో తెలుగుల‌నూ అలాంటి సినిమాలు వ‌స్తున్నాయ‌ని, `నా పేరు సూర్య‌` కూడా ఆ జాబితాలో చేరే చిత్ర‌మ‌వుతుంద‌న్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close