సుబ్బయ్యకు ఉరిశిక్ష..! వేశారా..? వేసుకున్నాడా…?

దాచేపల్లి చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితునికి ఉరి పడింది.సంచలనం సృష్టించిన ఈ కేసులో… నిందితుడ్ని బహిరంగంగా శిక్షించాలంటూ… ప్రజలు రెండు రోజుల్నించి దాచేపల్లిని స్తంభింపచేశారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్ లో నిలిచింది. నిందితుడు దొరకకపోవడంతో రాజకీయ అంశంగా కూడా మారింది. కానీ కేసును పోలీసులు ఒక్కరోజులోనే క్లోజ్ చేశారు. నిందితుడు సుబ్బయ్య ఉరి వేసుకోవడం… ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించడంతో కేసు ముగిసిపోయింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మిగిలిపోయిన అనుమానం… కీచకుడు సుబ్బయ్య తనకు తానుగా ఉరి శిక్ష విధించుకున్నాడా..? లేక పోలీసులే విధించారా..? అన్నదే.

కథువా, ఉన్నావో లాంటి సంచలనాత్మక ఘటనల తర్వాత కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్ జారి చేసింది. దాచేపల్లి ఆందోళన కారులు.. అక్కడి ప్రజాసంఘాల నేతలు కూడా పోలీసులకు ఈ చట్టాన్ని ఉదహరిస్తూ… నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా.. నిందితుడ్ని పట్టుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరి శిక్ష విధిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆందోళన కారులు శాంతించారు. విచిత్రంగా .. ఆ తర్వాత నుంచే పోలీసుల వైపు నుంచి… నిందితుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ప్రారంభమయింది. సుబ్బయ్యకు ఆయన బంధువులకు ఫోన్ చేశారని… తనకు బతకాలని లేదని చెప్పారనేది ఆ ఫోన్ లీకేజీ సారాంశం. ఆ ఫోన్ రికార్డింగ్ ను కూడా పోలీసులు విడుదల చేశారు. దాని ఆధారంగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న నమ్మకంతో .. పోలీసులు గాలింపులు ప్రారంభించారు. చివరికి వారి అన్వేషణ ముగిసింది. దైద దగ్గర ఓ చెట్టుకు ఊరి వేసుకుని సుబ్బయ్య చనిపోయినట్లు తేల్చారు.ఓ సాధారణ వ్యక్తి.. పదిహేడు పోలీసు బృందాలను తప్పించుకుని.. తిరగడం.. అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు.

9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్యకు పడేది ఉరిశిక్షనే. అమలు జరిగింది కూడా అదే. ఆ శిక్షను తకు తానే విధించుకున్నాడా..? లేక పట్టుకుని పోలీసులే అమలు చేశారా అన్నది తర్వాతి సంగతి.కొన్నేళ్ల కిందట.. ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఏ ఒక్కరూ కూడా అది తప్పని చెప్పలేదు. ఇప్పుడు సుబ్బయ్య్యకు కూడా పోలీసులు ఉరి వేశారని తేలినా… ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close