అశోక్‌బాబుకు రాజకీయ అవకాశం అంది వస్తోందా..?

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు… నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్‌మీట్ పెడుతున్నారు. టీవీ చానళ్లలో చర్చల్లో పాల్గొంటున్నారు. అజెండా ప్రత్యేకహోదా ఉద్యమమే అయినా… ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఆయనను బీజేపీ టార్గెట్ చేసింది కాబట్టే… ఆ పార్టీపై స్పందిస్తున్నారు. ఏపీ హక్కుల పోరాట సంఘం పేరుతో కర్ణాటక వెళ్లి అక్కడి తెలుగువారితో సమావేశమై… బీజేపీకి ఓటు వేయవద్దని ప్రచారం చేయడంతోనే అసలు వివాదం ప్రారంభమయింది.అక్కడ కొంత మంది నేతులు అడ్డుకోవడం.. అది కలకలం రేపడంతో… అశోక్ బాబు వార్తల్లోకి వ్యక్తి అయ్యారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ.. రెండు, మూడు రోజుల నుంచి బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు . అటు ఈసీతో పాటు..ఇటు గవర్నర్ కూ ఫిర్యాదు చేశారు. అశోక్ బాబు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అచ్చం రాజకీయ నాయకుడిలా బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మద్దతు కోసం వచ్చినప్పుడు.. తాను మద్దతు ప్రకటించినప్పుడు రూల్స్ గుర్తు లేవా అని కౌంటర్ ఇస్తున్నారు.

మొత్తానికి బీజేపీతో చెలరేగిన వివాదంలో అశోక్‌ బాబులో ఓ రాజకీయ నేత బయటకు వస్తున్నారన్న అభిప్రాయం ఊపందుకుంటోంది. నిజానికి ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్న వారు ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుని… పదవీ విరమణ అనంతరం.. రాజకీయ జీవితాన్ని పొందడం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. తెలగాణ ఉద్యమ సమయంలో.. టీఆర్ఎస్‌ ఎలా చెబితే అలా చేసిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా కీలక పొజిషన్లలో ఉన్నారు. ఏపీ ఉద్యోగసంఘాల్లో మాత్రం అలా ఎదిగిన వాళ్లు లేరు. గత ఎన్నికల సమయంలోనే అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవ రూపంలోకి రాలేదు. కొన్నాళ్ల క్రితం ఉద్యోగసంఘాల నేతగా వ్యవహరించిన గోపాల్ రెడ్డి… ప్రస్తుతం వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు.

ప్రస్తుత వివాదంలో అశోక్ బాబు నేరుగా ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయడం లేదు. తనంతట తానుగా ఉద్యోగసంఘాల నేతగా.. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మాత్రమే నడుపుతున్నానంటున్నారు. ఆ క్రమంలో ప్రధాని మోదీపై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇది కూడా బీజేపీ నేతలుకు కాస్త ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే ఇదంతా అశోక్ బాబు కావాలనే చేస్తున్నారన్న అంచనాలున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. ఏపీలో ప్రత్యేకహోదా ..సెంటిమెంట్ గా మారిన సమయంలో… అశోక్ బాబు.. ఇదే అంశంపై పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఇవన్నీ చూస్తూంటే.. రాజకీయాల విషయంలో ఆయన ఆలోచనల్లో డబుల్ మీనింగ్‌లేమీ ఉండకపోచ్చు. సింగిల్ పొలిటికల్ మీనింగే ఉండొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close