వ‌ర్మ ఐడియా అదిరింది: ‘శివ’ సినిమా కోసం ఓ సినిమా..!

ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. కాస్త నేమూ, ఫేమూ ఉండి.. వాళ్ల జీవితంలో డ్రామా క‌నిపిస్తే బ‌యోపిక్ తీయ‌డానికి ‘స‌రుకు’ దొరికేసిన‌ట్టే అని ఫీల‌వుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సినిమా గురించి సినిమా తీస్తే..? ఈ ఐడియా మాత్రం సినీ మేధావి రాంగోపాల్ వ‌ర్మ‌కి వ‌చ్చింది. అవును… త‌న సినీ ప్ర‌యాణం మొద‌లైన ‘శివ‌’ సినిమా గురించి ఓ సినిమా రాబోతోంది. అస‌లు ‘శివ‌’ అనే ఐడియా ఎక్క‌డ మొద‌లైంది? వ‌ర్మ దాన్ని ఎవ‌రెవ‌రితో పంచుకున్నాడు? నాగార్జున‌కు ఈ క‌థ చెప్పి ఎలా ఒప్పించాడు? ఆ సినిమా ప్రయాణంలో జ‌రిగిన సంగ‌తులేంటి? ఇవ‌న్నీ క‌ల‌సి ఓ సినిమా తీస్తే బాగుంటుంద‌న్న‌ది వ‌ర్మ అయిడియా. కాక‌పోతే ఈ చిత్రానికి వ‌ర్మ ద‌ర్శ‌కుడు కాదు, క‌నీసం నిర్మాత కూడా కాదు. జ‌స్ట్ ఐడియా ఇచ్చాడంతే.

ఈమ‌ధ్య రాంగోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర‌కు ఓ యువ ద‌ర్శ‌కుడు వ‌చ్చి ‘మీ జీవిత క‌థ‌ని సినిమాగా తీస్తా’ అని అడిగాడ‌ట‌. దానికి వ‌ర్మ ‘నా జీవితంలో పెయిన్ లేదు. నా క‌థ సినిమా స్టోరీగా ప‌నిచేయ‌దు’ అని చెప్పాడ‌ట‌. అయితే.. ‘శివ సినిమా ప్ర‌యాణాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అని ఐడియా ఇచ్చాడ‌ట‌. ఈ ఐడియ బాగుండ‌డంతో ఆ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం ‘శివ‌’ తాలుకూ క‌థ‌ని, ఆ ప్ర‌యాణాన్నీ ఆధారం చేసుకుని ఓ స్క్రిప్టు త‌యారు చేసుకుంటున్నాడు. తెలుగు సినీ చ‌రిత్ర‌లో మైలురాళ్లు అన‌దగ్గ సినిమాల్లో ‘శివ‌’కూడా ఉంటుంది. ఆసినిమా తాలుకూ సంగ‌తుల్ని తెలుసుకోవ‌డానికి ఇప్ప‌టికీ ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్లంద‌రికీ ‘శివ‌’ హిస్ట‌రీపై సినిమా తీయ‌డం ఆక‌ట్టుకునే విష‌య‌మే. ఈ ప్ర‌య‌త్నం గ‌నుక స‌క్సెస్ అయితే సినిమాల‌పై సినిమాలు అనే ట్రెండ్ శ్రీ‌కారం చుట్టుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close