తేజ నుంచి.. ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌

సావిత్రి బ‌యోపిక్ ఈమ‌ధ్యే చూశాం. అలాంటి ఎత్తుప‌ల్లాలు, అనూహ్య‌ప‌రిణామాలు, విధి వైప‌రిత్యాలు ఉద‌య్ కిర‌ణ్ జీవితంలోనూ ఉన్నాయి. వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఈ యువ తేజం.. స‌డ‌న్‌గా చ‌తికిల‌ప‌డింది. బ‌తుకు భారం, అవ‌మానాల్నీ మోయ‌లేక ఓరోజు త‌నువు చాలించి టాలీవుడ్‌ని శోక సంద్రంలో ముంచేశాడు. ఇప్పుడు ఈ క‌థానాయ‌కుడి జీవిత క‌థ‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు తేజ‌.. ఈ బ‌యోపిక్ రూప‌క‌ల్ప‌న‌లో బిజీగాఉన్నార‌ని స‌మాచారం. తేజ – ఉద‌య్‌కిర‌ణ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రి కెరీర్ ‘చిత్రం’తోనే మొద‌లైంది. ఆ త‌ర‌వాత ‘ఔన‌న్నా కాద‌న్న’ కూడా వీరిద్ద‌రి కాంబోలోనే వ‌చ్చింది. ఉద‌య్ కిర‌ణ్ జీవితాన్ని అతి ద‌గ్గ‌ర‌గా చూసిన వ్య‌క్తుల్లో తేజ ఒక‌రు. అందుకే.. అత‌ని క‌థ‌ని తీయాల‌ని తేజ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ తీసే అవ‌కాశం వ‌చ్చినా దాన్ని ప‌క్క‌న పెట్టేశాడు తేజ‌. ఆ స‌మ‌యంలోనే ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తీయాలన్న ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. అయితే ఈ బ‌యోపిక్ కార్య‌రూపం ఎప్పుడు దాలుస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close