బీజేపీ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పోస్ట్..! కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం..!!

కర్ణాటక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ గవర్నర్‌ వ్యవస్థతో ఆడుకుంటోంది. యడ్యూరప్పకు ఆహ్వానం విషయంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గవర్నర్ కొత్తగా ప్రొటెం స్పీకర్ విషయంలోనూ అలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కే.జి.బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ… రాజ్ భవన్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. వాస్తవానికి కాంగ్రెస్ కు ఆర్వీ దేశ్ పాండేను ప్రొటెం స్పీకర్ గా సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు అసెంబ్లీ సెక్రటేరియట్ సమాచారం పంపింది. సభా సంప్రదాయాల ప్రకారం…ఎన్నికయిన సభ్యుల్లో అత్యంత సీనియర్‌ను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు. ఇప్పటి వరకూ ఇదే సంప్రదయాన్ని పాటించారు. కానీ కర్ణాటక గవర్నర్ మాత్రం దీన్ని ఉల్లంఘించారు. అసెంబ్లీ సెక్రటేరియట్ ఇచ్చిన సూచలను కూడా బుట్టదాఖలు చేసి… తన సొంత నిర్ణయం తీసుకన్నారు. బీజేపీకి చెందిన కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బోపయ్య కేవలం మూడు సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి.దేశ్ పాండే ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బోపయ్య గతంలో బీజేపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేశారు.

ఇప్పుడు బలపరీక్షలో బీజేపీకి స్పీకర్ కీలకం కావడంతో.. ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యేను నియమించేందుకు గవర్నర్ అధికారాన్ని మరోసారి దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొటెం స్పీకర్ కు కూడా.. సాధారణ స్పీకర్ కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. సభలో ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే… అప్పటికప్పుడే వారి ఓటును రద్దు చేసే అధికారం కూడా స్పీకర్‌కు ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ గా ఉంటే అలాంటి పరిస్థితే ఎదురవుతుందనుకున్న బీజేపీ.. నేతలు వ్యూహాత్మకంగా ప్రొటెం స్పీకర్ గా .. సొంత ఎమ్మెల్యేను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ ఉల్లంఘిస్తున్న ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఇదీ కూడా ఒకటి. అధికారం కోసం ప్రజాస్వామ్య విలువలను మరికొంచెం దిగజార్చింది బీజేపీ. గవర్నర్ వ్యవస్థపై మరోసారి అపనమ్మకాన్ని కల్పించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close