దేవిశ్రీ ష‌ర‌తులు… డిమాండ్లు

టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌతిండియాలోనే నెంబ‌ర్ వ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా స్థానం సంపాదించుకున్నాడు దేవిశ్రీ‌. ఆ మాట‌కొస్తే.. బాలీవుడ్‌లోనూ దేవీ ఫేమ‌సే. అక్క‌డి నుంచి అవ‌కాశాలు వ‌స్తున్నా – దేవి వెళ్ల‌డం లేదు. ఎందుకంటే సౌతిండియాలో దేవిశ్రీ అంత బిజీ. భారీ సినిమాల‌న్నీ ముందు దేవిశ్రీ ని సంప్ర‌దించి.. కుద‌ర‌క‌పోతే అప్పుడు మ‌రో ఆప్ష‌న్‌ని ఎంచుకుంటాయి. చిన్న సినిమాలు కూడా అప్పుడ‌ప్పుడూ దేవిని త‌ల‌చుకుంటుంటాయి. ఈ డిమాండ్‌ని బ‌ట్టే.. త‌న పారితోషికం ఉంటుంది క‌దా? అందుకే ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు దేవి. ఇంత పారితోషికం ఏ టెక్నీషియ‌న్‌కీ ఇవ్వ‌డం లేదు. పారితోషికం మాట అటుంచితే… దేవి ష‌ర‌తులు, డిమాండ్లూ చాలా ఉంటాయి. దేవికి ముందే బౌండెడ్ స్క్రిప్టు ఇవ్వాల్సి ఉంటుంది. ‘ఇదీ లైను’ అని చెబితే కుద‌ర‌దు. ఎక్క‌డ పాట రావాలో కూడా దేవినే డిసైడ్ చేస్తుంటాడ‌ట‌. దేవికి స్క్రిప్టులో నాలెడ్జ్ చాలా ఉంటుంది. కాబట్టి.. దేవి జ‌డ్జిమెంట్‌ని చిత్ర‌బృందాలు కూడా గౌర‌విస్తుంటాయి.

కానీ చెప్పిన టైమ్‌కి పాట‌లు ఇవ్వ‌డ‌ని దేవి గురించి బాగా తెలిసిన‌వాళ్లు చెబుతుంటారు. గీత ర‌చ‌యిత‌ల‌కు, గాయ‌కుల విష‌యంలోనూ దేవిదే అంతిమ నిర్ణ‌యం. ‘ఫ‌లానా గీత ర‌చ‌యిత‌కు ఓ పాట ఇవ్వండి, ఫ‌లానా గాయ‌కుడితో పాడించండి’ అన్నా దేవి వినిపించుకోడ‌ట‌. దేవి ష‌ర‌తులు కొన్ని సార్లు… ఇబ్బంది పెడుతున్నా. `దేవి చేతిలో సినిమా పెడితే మ్యూజిక్ గురించి టెన్ష‌న్ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు` అంటూ దర్శ‌కులు రిలాక్స్ అయిపోతుంటార్ట‌. రామ్ న‌టిస్తున్న ఓ సినిమా నుంచి దేవిశ్రీ ప్ర‌సాద్ త‌ప్పుకున్నాడు. దానికి కార‌ణం… క్రియేటివ్ డిఫ‌రెన్సెన్ అని ప్ర‌చారం ఉంది. నిజానికి సినిమా మొద‌లై ఇన్ని రోజులైనా దేవి ఒక్క పాట కూడా ఇవ్వ‌లేద‌ట‌. అడిగితే.. ‘ఇంకా ట్యూన్ త‌ట్ట‌లేదు.. త‌ట్టిన‌ప్పుడు చెబుతా’ అని బ‌దులిస్తున్నాడ‌ట‌. అందుకే ‘మ‌రొక‌ర్ని చూసుకుంటాం’ అని చిత్ర‌బృందం దేవిని త‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. దేవి కావాలంటే… కాస్త ఓపిక ప‌ట్టాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close