ప‌వ‌న్ పై ఆ ఛానెల్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వెన‌క కార‌ణం ఇదా..?

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా పోరాట యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ యాత్ర‌కు మీడియా క‌వ‌రేజ్ ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ ఆ మ‌ధ్య జ‌రిగింది. ప‌వ‌న్ వెర్సెస్ మీడియా వార్ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ‌స్సుయాత్రను కొన్ని ఛానెల్స్ సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేని మాట వాస్త‌వ‌మే. టీవీ నైన్‌, ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్స్ ఈ యాత్ర క‌వ‌రేజ్ విష‌యంలో ముందుగానే ఒక నిర్ణ‌యం తీసుకున్నాయ‌న్నారు! దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ యాత్ర‌కు త‌మ ప్ర‌సారాల్లో ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు. ఇక‌, మ‌హాటీవీ కూడా సో సో అన్న‌ట్టుగా క‌థ‌నాలు ఇస్తోంది. ఎన్టీవీ కూడా యాత్ర‌ను క‌వ‌ర్ చేస్తోంది. కానీ, ఏపీ 24×7 ఛానెల్ మాత్రం ప‌వ‌న్ యాత్ర‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది.

ప‌వ‌న్ యాత్ర లైవ్ ఇవ్వ‌డంతోపాటు, దానికి ముందూ త‌రువాత చ‌ర్చా కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ప్ర‌జా పోరాట యాత్ర‌లో ప‌వ‌న్ లేవ‌నెత్తుతున్న అంశాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది. టీడీపీ నేత‌లూ, జ‌నసేన మ‌ధ్య డైలాగ్ వార్ అంటూ చ‌ర్చ‌లు చేస్తోంది. ప‌వ‌న్ తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… ఇత‌ర ఛానెల్స్ తో పోల్చితే జ‌న‌సేనాని యాత్ర నేప‌థ్యంలో ఆ ఛానెల్ కాస్త ఎక్కువ హ‌డావుడి చేస్తోంది. దీనికి కార‌ణం వేరే ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది..!

ఈ ఛానెల్ డైరెక్టర్ గుత్తా సుమ‌న్ కుమార్‌… ఈయ‌న‌ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. జ‌నసేన పార్టీ నుంచి ఈయ‌న టిక్కెట్ ఆశిస్తున్నార‌ట‌! అందుకే జ‌న‌సేనకు సంబంధించిన క‌థాక‌థ‌నాల ప్ర‌సారాల్లో తన ఛానెల్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంద‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ మీడియా ఛానెల్స్ క‌వ‌రేజ్ సోసోగా ఉన్న ఈ త‌రుణంలో… ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్న ఓ ఛానెల్ అక్క‌ర‌కు రావ‌డం జ‌న‌సేకు క‌ల‌సి వ‌చ్చే అంశ‌మే క‌దా. పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నవారు.. వివిధ రకాలుగా సాయపడేందుకు ముందుకు రావడం మంచి విషయమే కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close