మెగా ఐడియా… చిరంజీవి ఫ్యామిలీ ఛారిటబుల్ ట్రస్ట్!

మెగా ఫ్యామిలీ నుంచి మరో చారిటబుల్ ట్రస్ట్ రాబోతోంది. ఆల్రెడీ ‘చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్’ ద్వారా మెగా ఫ్యామిలీ ఛారిటీ చేస్తోంది. ఇది కాకుండా మరో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు రామ్‌చ‌ర‌ణ్‌ ప్రకటించారు. బ్రాండ్స్‌కి ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఆదాయంలో 15 నుంచి 20 శాతం ట్ర‌స్ట్‌కి ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కొంత గ్యాప్ తరవాత బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ యాక్సెప్ట్ చేయడానికి కారణం అదేనని చెప్పుకొచ్చారు. హ్యాపీ మొబైల్స్ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని రామ్‌చ‌ర‌ణ్‌ వెల్లడించారు.

ఇంకా రామ్‌చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ “సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో కొంత చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌కి ఇస్తున్నాం. సుమారు దశాబ్ద కాలంగా బయట వ్యక్తుల దగ్గర నుంచి నయా పైసా తీసుకోకుండా బ్లడ్ బ్యాంక్‌ని రన్ చేస్తున్నాం. అవసరం వున్నవారికి కంటి ఆపరేషన్లు చేయించడం, రక్తదానాలు చేయడం చేస్తున్నాం. ఈ సేవను మరింత కొనసాగించాలని ఒక ఛారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ ఫౌండేషన్ పనులు మొదలయ్యాయి. త్వరలో ఫౌండేషన్ పేరు రిజస్టర్ చేయబోతున్నాం. ఒక్కసారి అది పూర్తయిన తరవాత సవివరంగా ప్రకటిస్తాం. బహుశా… నెల రోజుల లోపు ఫౌండేషన్‌తో ప్రజల ముందుకి వస్తాం. ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనేది నాన్నగారి (చిరంజీవి) ఐడియా. ప్రతి నెల మా పరిధిలో ఐదారుగురు అభిమానులకు సహాయం చేస్తున్నాం. కిడ్నీ సమస్యలు వున్నవారికి, క్యాన్సర్ పేషేంట్స్‌కి హెల్ప్ చేస్తున్నాం. దీన్ని నిర్మాణాత్మక పధ్ధతిలో చేయాలని ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మెడికల్ సమస్యలు వున్నవారికి సహాయం చేయడం కోసమే దీన్ని మొదలుపెడుతున్నాం. అభిమానులకు దీన్ని అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం. బ్రాండ్స్ నుంచి వచ్చే ఆదాయంలో 15 శాతం నుంచి 25 శాతం వరకూ ఫౌండేషన్‌కి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఈ సంగతి (రెమ్యునరేషన్‌లో కొంత ఛారిటీకి ఇచ్చే విషయం) చెప్పకూడదని అనుకున్నా. అందరికీ ఆదర్శంగా వుంటుందని చెబుతున్నా” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close