నా (సినిమా) పోస్ట‌ర్ల మీద క‌లెక్ష‌న్స్ వేయొద్దని చెబుతా: రామ్‌చ‌ర‌ణ్‌

“ఎంతమంది థియేటర్లకు వచ్చి సినిమా చూశారనే దానికి డెఫినిషన్.. కలెక్షన్స్. ఎక్కడికి వెళ్లినా పదిమంది మీ సినిమా బాగుందని చెప్పడంలో వున్న ఆనందం.. కచ్చితంగా నంబర్స్ (కలెక్షన్స్) ఇవ్వదు. మా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి కానీ… నేను నటించే సినిమా నిర్మాణ సంస్థల నుంచి కానీ… అధికారికంగా లెక్కలు (సినిమా వసూళ్లు) బయటకు రావు. ఎందుకంటే… క‌లెక్ష‌న్స్‌తో లేనిపోని కాంట్రవర్సీలు వస్తున్నాయ్. హీరోలంతా వెరీ గుడ్ ఫ్రెండ్స్. అభిమానులు కూడా అంతే ఫ్రెండ్లీగా వుండాలని కోరుకుంటున్నాం. హెల్దీ కాంపిటీషన్ వుండాలని కోరుకుంటున్నాం. అది నిజం కావాలంటే… యాక్టర్లుగా మేమంతా (హీరోలు) పోస్టర్ల మీద లెక్కలు వేసే ధోరణి నుంచి వెనకడుగు వేయాలి” – ‘రంగస్థలం’ రెండొందల కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా… రామ్‌చ‌ర‌ణ్‌ చెప్పిన సమాధానమిది.

“సినిమా వసూళ్లు, నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కల పట్ల ప్రేక్షకుల స్పందిస్తున్న తీరు సరిగ్గా లేదు” అని చరణ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మా సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే… మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని నిర్మాతలు పోటాపోటీగా వసూళ్ల లెక్కలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల లెక్కలపై ప్రేక్షకుల్లో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్‌చ‌ర‌ణ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

“ఎవరైనా వున్నది వున్నట్టుగా సరైన లెక్కలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు, ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారనేది మా చేతుల్లో లేదు. ఈ వసూళ్ల లెక్కలు చెప్పడం వల్ల కొన్నిసార్లు ప్రేక్షకుల్లో లేని ఫీలింగ్ తీసుకొస్తున్నామా? అనిపిస్తుంది. తప్పుగా ఉద్దేశించి చెప్పడం లేదు. మేము నిజాయితీగా అనుకునేది కొన్నిసార్లు ఎదుటివ్యక్తులు అపార్థం కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలని అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో నా నిర్మాతలను లెక్కలు ప్రకటించవద్దని రిక్వెస్ట్ చేస్తా. ఇకపై నా పోస్టర్ల మీద కలెక్షన్స్ లెక్కలు వేయవద్దని చెబుతా” అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close