మహేశ్ చేశాడుగా.. మళ్లీ నేను చేస్తే బోర్ కొడుతుంది: రామ్‌చ‌ర‌ణ్‌

మెగా కుటుంబానికి, రాజకీయాలకు దగ్గర సంబంధం వుంది. ఒకప్పుడు చిరంజీవి రాజకీయాల్లో దిగితే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆయన వెనుక ప్రచారం చేశారు. తరవాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తున్నారు. సినిమా నటీనటులు రాజకీయాల్లో హ‌ల్‌చ‌ల్‌ చేయడమే కాదు… సినిమాల్లో రాజకీయాలు కూడా హ‌ల్‌చ‌ల్‌ చేస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ హిట్ అయ్యింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పలువురు హీరోలు రాజకీయ నేపథ్యంలో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, రామ్‌చ‌ర‌ణ్‌కి కూడా రాజకీయ రంగులతో కూడిన సినిమా చేసే ఆలోచన వుందా? ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే “పొలిటికల్ మూవీస్ ఆ? ఇప్పుడే మహేశ్ చేశాడుగా… మళ్లీ నేను చేస్తే బోర్ కొడుతుంది. ప్రస్తుతానికి నేనేమీ అలాంటి ప్లాన్స్ చేయడం లేదు” అని చెప్పాడు. రాజకీయ నేపథ్యంలో సినిమా చేయడానికి మీ లుక్స్ బాగుంటాయని ఓ మహిళా విలేకరి చెప్పగా “ప్రస్తుతం నా వయసుకు అంత బరువైన పాత్రలు చేయగలుగుతానో? లేదో? తెలీదు. మహేశ్ బాబు సీనియర్ హీరో. ‘భరత్ అనే నేను’లో అందంగా చేశాడు. భవిష్యత్తులో చూద్దాం. అలాంటి సినిమాలు చేయకూడదని ఏమీ అనుకోవడం లేదు. ప్లాన్స్ కూడా చేయడం లేదు. ఓపెన్ మైండ్‌తో వుంటా. ఏం జరుగుతుందో? చూద్దాం” అని స్పందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close