అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘పెద్ది’ ట్రైలర్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పాటల్లో రామ్ చరణ్‌ను క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా మాత్రమే చూపించిన బుచ్చిబాబు.. ఈసారి ట్రైలర్లో కథలోని అసలైన కాన్ఫ్లిక్ట్ను, పెద్ది ప్రపంచాన్ని మరింత డీటెయిల్‌గా పరిచయం చేశాడు.
ఒక ట్రైన్ ఎమర్జెన్సీ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేసిన విధానం చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత బోమన్ ఇరానీ పాత్ర ద్వారా పెద్ది ప్రపంచాన్ని పరిచయం చేస్తూ.. “ఇక్కడ ఎవరిని అడిగినా ఫేవరెట్ ఆట మారుతుంది గానీ ఆటగాడు మారడు” అనే డైలాగ్‌తో పెద్ది క్యారెక్టర్ స్టేచర్‌ను ఎస్టాబ్లిష్ చేశారు.
రామ్ చరణ్ ఈ సినిమాలో “ఆట కూలీ”గా కనిపిస్తాడని మొదటి నుంచే ప్రచారం జరిగింది. ఇప్పుడు ట్రైలర్లో దివ్యేందు శర్మ డైలాగ్‌తో దాన్ని క్లియర్ చేశారు. పెద్ది కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. రెజ్లర్, రన్నర్.. ఇలా మల్టిపుల్ గేమ్స్‌లో దిట్ట. పెద్ది క్యారెక్టర్‌ను ఒక “క్రాస్ ఓవర్ అథ్లెట్”గా డిజైన్ చేసిన విధానం కొత్తగా వుంది.
జాన్వీ కపూర్ ఎంట్రీతో కథలో రొమాంటిక్ యాంగిల్ కూడా వస్తుంది. ఆమె పాత్రను బుచ్చిబాబు మాస్ టచ్‌తో డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆమె మాట్లాడే డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా రూరల్ మాస్ నేపథ్యానికి తగ్గట్టుగా ఉన్నాయి.
అయితే ‘పెద్ది’ అసలు కాన్సెప్ట్ మాత్రం జగపతిబాబు చెప్పే డైలాగ్‌లో దాగి ఉంది. “మనందరం ఒకే భూమిలో పుట్టినప్పుడు… నువ్వున్న చోట మనిషికి విలువ ఎక్కువ, మేమున్న చోట మనిషికి విలువ తక్కువా?” అనే డైలాగ్ ఈ కథలోని అసలైన సంఘర్షణను బయటపెడుతుంది. సమానత్వం కోసం చేసే పోరాటం ఈ కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
ఇక రామ్ చరణ్ చెప్పే.. “మాటలతో కాదు… ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను!” అనే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.
“మీరు అందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… కానీ నేను పోరాడాను” అనే పెద్ది డైలాగ్‌తో ఈ పాత్రలోని ఎమోషనల్ డెప్త్‌ను చూపించారు.
శివరాజ్‌కుమార్ పాత్ర చెప్పిన “ఆటని బతికించేవాడు కావాలి” అన్న డైలాగ్ .. పెద్ది ప్రయాణానికి మరో ఎమోషనల్ వెయిట్‌ను తీసుకొచ్చింది.
ఈ ట్రైలర్ మొత్తం “పెద్ది షో”గా అనిపిస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు రామ్ చరణ్ పూర్తిగా పెద్ది పాత్రలో లీనమై కనిపించారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్.. అన్నీ కూడా ఇప్పటివరకు చూడని విధంగా ఉన్నాయి. ఈ పాత్ర కోసం చరణ్ ఎంత తపన పడ్డారో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది.
బుచ్చిబాబు కూడా ఎక్కువ ఎలివేషన్స్ జోలికి వెళ్లకుండా.. క్యారెక్టర్‌కు, కథకు అవసరమైన అంశాలనే హైలైట్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేశాడు. అందుకే ఇది మాస్ ట్రైలర్ మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫీలింగ్‌ను కూడా ఇస్తోంది.
1980ల బ్యాక్‌డ్రాప్‌ను రీక్రియేట్ చేసిన విధానం ట్రైలర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా కోసం దాదాపు 70 సెట్లు వేశారని చెబుతున్నారు. కానీ ట్రైలర్ చూస్తే అవి సెట్లు అన్న భావనే రాదు. అన్నీ నిజమైన గ్రామాల్లో షూట్ చేసినట్టుగా నేచురల్‌గా కనిపిస్తున్నాయి.
ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరో పెద్ద బలం. ముఖ్యంగా ట్రైలర్ సెకండ్ హాఫ్‌లో ఆయన ఇచ్చిన ఎమోషనల్ బీట్ చాలా పవర్‌ఫుల్‌గా వర్కౌట్ అయింది. ట్రైలర్ ముగిసే సరికి ‘పెద్ది’ ప్రపంచంలోకి పూర్తిగా తీసుకెళ్లగలిగింది.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది.


