బ్రహ్మానందాన్ని అంతలా తీసిపారేశారేంటి?

లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నేల టికెట్టు’లో బ్రహ్మానందం నటించారు. థియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకుడికి గుర్తు చేస్తే తప్ప సినిమాలో బ్రహ్మీ నటించాడనే సంగతి గుర్తు లేదంటే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఎందుకంటే… సినిమాలో ఆయన పాత్ర అంత గొప్పగా వుంటుంది మరి. ఎంత గొప్ప అంటే… సుమారు 2.45 గంటల సినిమాలో ఆయనకు రెండంటే రెండు డైలాగులు మాత్రమే వున్నాయి. అవీ 30 ఇయర్స్ పృథ్వీతో హీరో మందు సిట్టింగ్‌లో కూర్చున్నప్పుడు. అందులో ఓ డైలాగ్ అయితే ‘అవునా?’ అని! ఆయన కంటే జూనియర్స్ అయిన పృథ్వీ, ప్రవీణ్, పోసాని, రఘుబాబులకు కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ డైలాగులు ఉంటే… ఈయనకు కొన్ని సన్నివేశాల్లో బేల చూపులు మాత్రమే మిగిలాయి. మరింత దారుణమైన విషయం ఏంటంటే… చాలా సన్నివేశాల్లో కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్ టైపులో గుంపులో గోవిందగా నిలబెట్టారు. అటువంటి పాత్రకు బ్రహ్మానందాన్ని తీసుకోవడం ఎందుకో మరి? బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్ చేత సినిమాలో అత్యంత ప్రాధాన్యత లేని పాత్ర చేయించడం ఏంటోనని విమర్శకులతో పాటు ప్రేక్షకుడు కూడా జుట్టు పీక్కునే పరిస్థితి.

బ్రహ్మానందం కామెడీ రొటీన్ అవుతుందనే విమర్శ వున్నప్పటికీ… స్క్రీన్ మీద ఆయన కనిపించే సరికి రొటీన్‌గా నవ్వేసే ప్రేక్షకులు, మాస్ జనాలు ఇంకా వున్నారు. పరమ రొటీన్ సన్నివేశాలను బ్రహ్మానందం తన నటనతో కొంచెం గట్టు ఎక్కించిన సందర్భాలు, ‘నేల టిక్కెట్టు’ వంటి రొటీన్ సినిమాలో ఎంతోకొంత నవ్వులు పూయించిన సన్నివేశాలు కోకొల్లలు. అటువంటి ఆణిముత్యాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సరిగా వాడుకోలేదు అనడం సబబుగానే వుంటుందేమో. బ్రహ్మానందాన్ని అంతలా తీసిపారేశారేంటో? ఒకవేళ ఆయనపై సన్నివేశాలు చిత్రీకరించి, ఎడిటింగులో తీసేశారని అనుకోవడానికి మిగతా సన్నివేశాలు ఏమంత గొప్పగా వున్నాయని! బహుశా… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో బ్రహ్మీపై కొన్ని సీన్లు తీసి, ఎడిటింగులో లేపేశారు. ఆ తరవాత ఓ పెద్ద హీరోలో ఇంత నాశిరకం పాత్ర బ్రహ్మానందంకి లభించడం ఇదేనేమో!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close