జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ ధరలు..! రాష్ట్రాలను కేంద్రం బ్లాక్‌మెయిలింగ్ చేస్తోందా..?

దేశంలో ఇప్పుడంతా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై గగ్గోలే. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా… ప్రజలను మాత్రం కేంద్రం బాదేస్తోంది. ఆ లాజిక్కేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. దానికి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకున్నా.. వాస్తవానికి.. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే తగ్గించాలి… పెరిగితే పెంచాలి. ఈ మెకానిజంలో .. పెరుగుడు మాత్రమే వర్కవుట్ అవుతోంది. యూపీఏ-2 ప్రభుత్వం ఘోరపరాజయం పాలవడానికి ఈ పెట్రోల్ రేట్లు కూడా ఓ కారణం. అప్పట్లో యూపీఏ పరిస్థితి బాగోలేక..అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 125 డాలర్లకు చేరుకుంది. మోదీ లక్కేమిటో కానీ.. పదవి చేపట్టగానే…క్రూడాయిల్ ధరలు 70 శాతం పడిపోయాయి. కానీ ప్రజలపై భారం అలాగే కొనసాగించి.. ఎక్సైజ్ పన్నును పెంచుతూ డబ్బును తన ఖాతాలో వేసుకుంది. అయితే ధరలు పెరగలేదు కాబట్టి.. ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు బీజేపీకి బ్యాడ్ టైం స్టార్టయింది. దానితో పాటే క్రూడాయిల్ ధరలూ పెరుగుతున్నాయి. దాంతో రేట్లు పెంచేందుకు కేంద్రం ఏ మాత్రం సంకోచించడం లేదు. దీంతో ప్రజాగ్రహం మొత్తం బీజేపీపై, ప్రధాని మోదీపై మళ్లుతోంది. రాష్ట్రాలు కూడా.. కేంద్రంపైనే విమర్శలు చేస్తున్నాయి. దీంతో కేంద్రం జీఎస్టీలోకి తెస్తామంటూ ప్రకటనలు ప్రారంభించింది. కానీ నిజంగానే కేంద్రానికి పెట్రోల్, డీజిల్ పరిధిలోకి తెస్తుందా..అంటే వంద శాతం అసాధ్యమనే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే.. రాష్ట్రాలను బ్లాక్ మెయిల్ చేయడానికే కేంద్రం ఈ జీఎస్టీ అనే ప్రతిపాదన తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే..అత్యధిక శ్లాబ్ రేటు 28శాతం కింద పరిగణించినా పెట్రోల్ రేటు 50 రూపాయల లోపే ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తేనే ధరలు తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పెట్రో ధరలు వాస్తవంగా, న్యాయంగా ఉండాలంటే GST పరిధిలోకి తీసుకురావటం ఒక్కటే ఏకైక మార్గం అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించవనే ఆయన ధీమా. నిజంగానే రాష్ట్రాలు అంగీకరించే ప్రశ్నే లేదు. రిఫైన్ చేసిన తరువాత పెట్రోలు ధర లీటర్ కు రూ. 36 వరకూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్ కు ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ సెస్ రూ. 20 వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు.. కొంచెం అటూఇటూగా 35 శాతం వ్యాట్ విధిస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో మరో రూ. 20. ఇప్పుడు కేంద్రానికి ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ సెస్ ద్వారా ఏడాదికి రూ. 2లక్షల 40 వేల కోట్లపైనే వస్తోంది. ఇంచు మించు అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఏపీ వంటి ప్రభుత్వాలకు.. ఇదే ప్రధాన ఆదాయంగా ఉంది.

ఇప్పుడు దీన్నీ తీసుకెళ్లి జీఎస్టీలో కలిపితే.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. అప్పుడు కేంద్రంపై మరింతగా ఆధారపడాల్సిందే. మరి కేంద్రానికి ఏమైనా ఆదాయం వస్తూందా అంటే అదీ లేదు.. కేంద్రం ఆదాయం కూడా సగానికి పడిపోతుంది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తేనే.. దేశ అర్థిక వ్యవస్థ పై ప్రభావం పడుతుందని..అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని.. కేంద్రం చెప్పుకొస్తోంది. అలాంటిది.. ఏకంగా జీఎస్టీలోకి తెస్తుందా..? తీసుకు రాదు.. కానీ పెట్రోధరల పెంపు .. పాపం తమ మీద పడకుండా.. రాష్ట్రాలకూ పంచేలా.. తలాపాపం.. తిలాపిడికెడు అన్నట్లుగా పంచడానికి జీఎస్టీ పేరుతో బెదిరింపులు చేస్తోంది. అంతే..! ‍‍

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close