బాలీవుడ్‌లో మళ్లీ బెట్టింగ్ క్రైం థ్రిల్లర్..! సల్మాన్ సోదరుడే ఫస్ట్ వికెట్..!!

బాలీవుడ్‌ని ఐపీఎల్ బెట్టింగ్ వివాదం మరోసారి చుట్టు ముట్టింది. సల్మాన్ ఖాన్ సోదరుడు… ఆర్భాజ్ ఖాన్ కు ధానే పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. సోను జలాన్ అనే బుకీని పోలీసులు అరెస్ట్ చేయడంతో… బాలీవుడ్ సెలబ్రిటీలు.. బెట్టింగ్ లో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆర్భాజ్ ఖాన్ తో బుకీ సోను జలాన్ దిగిన ఫోటోలు పోలీసులకు లభించడంతో ముందుగా… నోటీసులు పంపారు. ఐపీఎల్ గత ఇరవై ఏడో తేదీన ముగిసింది. బుకీ సోను జలాన్… రెండు వేల ఎనిమిదిలో కూడా ఓ సారి బెట్టింగ్ కేసులో అరెస్టయ్యారు. జలాన్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ధానే పోలీసుల ఎదుట.. శనివారం ఆర్భాజ్ ఖాన్ హాజరయ్యే అవకాశం ఉంది.

బెట్టింగ్ లో ఆర్భాజ్ ఖాన్ విషయంలో చాలా విచిత్రంగా బయటకు వచ్చింది. ఓ బెట్టింగ్ కేసులో అరెస్టయిన వ్యక్తిని కలవడానికి సోను జలాన్ కోర్టు దగ్గరకు వచ్చారు. అక్కడే సోనును పోలీసులు పట్టుకున్నారు అతన్ని విచారించడంతో బాలీవుడ్ గుట్టు బయటపడింది. ఆర్భాజ్ భారీగా బెట్టింగ్ పాల్పడినట్లు సోనుజలాన్ పోలీసులు చెప్పినట్లు ప్రచారం జరిగుతోంది. ఈ బెట్టింగ్ లో మరింత మంది బాలీవుడ్ తారలు ఉన్నారన్న ఊహాగానాలు సహజంగానే ప్రారంభమయ్యాయి. 2013లో బయట పడిన ఐపీఎల్ బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ అరెస్టయ్యారు. ఆ స్కాం కలకలం సృష్టించింది. చెన్నై టీమ్ రెండేళ్ల పాటు టోర్నీకి దూరమయింది కూడా.

క్రికెట్ కు , బాలీవుడ్ కు విడదీయలేని సంబంధం ఉంది. ఐపీఎల్ టీముల్లో బాలీవుడ్ స్టార్లు భాగస్వాములుగా ఉన్నారు. షారుక్ చేతిలో కోల్ కతా, ప్రీతి జింటా చేతిలో పంజాబ్ జట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ టీములకి ఈ బెట్టింగ్‌లో భాగం ఉందో లేదో బయటకు రాలేదు. బుకిలను ప్రస్తుతం థానే పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముందుకెళ్లే కొద్దీ సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close