పార్టీ మార్పుపై ఇన్నాళ్ల‌కు మౌనం వీడిని ఆనం..!

టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఈ మ‌ధ్య రాజ‌కీయంగా కాస్త మౌనంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీని వ‌దిలి, వైకాపాలో చేర‌బోతున్న‌ట్టు కూడా క‌థ‌నాలు గుప్పుమ‌న్నాయి. కానీ, వాటిని ఆయ‌న ఖండించ‌లేదు. అంతేకాదు.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఈ మ‌ధ్య దూరంగా ఉంటున్నారు. టీడీపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మంలో పార్టీపైనా, కొంత‌మంది నేత‌ల‌పైనా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. నెల్లూరు ఇన్ ఛార్జ్ గా ఉంటూ, ఆ జిల్లాలో జ‌రిగిన మినీ మ‌హానాడుకి కూడా ఆయ‌న హాజ‌రు కాక‌పోవ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఒకింత గంద‌ర‌గోళ‌మే నెల‌కొంది. అయినాస‌రే, పార్టీ మార్పుపై మౌనంగానే ఉంటూ వ‌చ్చారు. ఎట్టకేల‌కు తాజాగా ఈ అంశంపై ఆయ‌న స్పందించ‌డం విశేషం!

గుర్తింపూ గౌర‌వం లేని చోట ప‌నిచెయ్య‌లేన‌ని ఆనం చెప్పారు. గ‌తంలో ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టాన‌నీ, త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించాన‌నీ, కానీ ప్రాధాన్య‌త ద‌క్క‌ని చోట స్త‌బ్దుగా ఉండ‌టం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. పార్టీ మార్పుపై విలేక‌రులు ప్ర‌శ్నిస్తే.. త‌న‌కు జిల్లావ్యాప్తంగా స‌న్నిహితులూ, అభిమానులూ ఉన్నార‌నీ వారంద‌రితో చ‌ర్చిస్తాన‌ని అన్నారు. వారి ఇష్ట‌ప్ర‌కార‌మే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించిన కీల‌క నిర్ణ‌యం ఉంటుంద‌ని ఆనం స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న వైకాపా వైపు చూస్తున్నారంటూ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఊహాగానాలు వినిపిస్తే.. తాజాగా ఆయ‌న కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జిల్లాలోని ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత‌ల‌కు ఆయ‌న ఈ మ‌ధ్య క‌లుసుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మ‌రోసారి బ‌లోపేతం కావాల‌ని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రానికి పార్టీ వ్య‌హారాల కొత్త ఇన్ ఛార్జ్ గా ఉమెన్ చాందీ కూడా నియ‌మితుల‌య్యారు. గ‌తంలో పార్టీ వీడి వెళ్లిపోయిన‌వారిని తిరిగి ఆహ్వానిస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆనం కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఏపీ కాంగ్రెస్ కి బ‌ల‌మైన నేత‌ల కొర‌త చాలా ఉంది క‌దా! కాబ‌ట్టి, ఇలాంటి అసంతృప్త నేత‌ల్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం వారికి అనివార్యం. ఏదేమైనా, ఆయ‌న టీడీపీలో కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close