టీడీపీలో “గంటా” కలకలం..! సర్వే పెట్టిన చిచ్చే.. !!

మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై దాదాపుగా తిరుగుబాటు చేసినంత పని చేశారు. మంత్రివర్గ భేటీకి డుమ్మాకొట్టడమే.. కాదు..దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని టీడీపీ నేతలకు సంకేతాలు పంపేశారు. గంటా ఇప్పటికిప్పుడు తన అసంతృప్తిని బయటపెట్టుకోవడానికి కారణం… ఆంధ్రజ్యోతి కోసం ఆర్జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వే. ఆ సర్వేలో.. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం భీమిలీలో… టీడీపీ ఓడిపోతుందన్న ఫలితం వచ్చింది. గంటాపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నట్లుగా రిజల్ట్ ప్రకటించారు. ఇదంతా తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనని ఆయన భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. విశాఖ జిల్లా టీడీపీలో ఉన్న వర్గ రాజకీయాలు కూడా గంటా ఆసంతృప్తికి కారణం.

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించినా.. మధ్యలో పీఆర్పీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లకు వెళ్లి గత ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు అయ్యన్నపాత్రుడుతో సన్నిహితంగా మెలిగినా… రెండో సారి పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయ్యన్న పాత్రుడు.. గంటాను టార్గెట్‌ చేసుకుని… ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు విమర్శలు చేస్తూంటారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య సర్దుబాటు చేయడానికి టీడీపీ హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వలేదు.

రెండేళ్లుగా తనకు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని గంటా చెబుతున్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని.. ఆయన కొంత కాలంగా తన సన్నిహితులతో చెబుతున్నారు. తనపై అనేక అవినీతి ఆరోపణలు చేశారని… తనపై కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా వేశారని.. వీటన్నింటి వెనుక టీడీపీ నేతలే ఉన్నారని గంటా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు ఇచ్చిన పట్టించుకోవడం లేదని గంటా చెబుతున్నారు. విశాఖ భూకుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిట్‌ తన ప్రమేయం లేదని తేల్చిందని.. ఆ నివేదికను కావాలనే ప్రభుత్వం బయటపెట్టడం లేదని.. గంటా అనుమానిస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు అసంతృప్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో… గంటా ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో ప్రారంభమయింది. బుధవారం విశాఖ జిల్లాలో … అదీ కూడా గంటా నియోజకవర్గం భీమిలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఆ టూర్‌కు కూడా గంటా డుమ్మా కొడితే… పరిస్థితి సీరియస్సేనని భావించాలని టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close