ముందస్తుపై కేసీఆర్ కాన్ఫిడెన్స్..! మేం రెడీ అన్న కాంగ్రెస్..!!

దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి టీఆర్ఎస్ విజయంపై ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని.. సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధానమంత్రితో అంతకు ముందే సమావేశం అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన … ముందస్తు కసరత్తులో మునిగిపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆక్టోబర్ డెడ్‌లైన్ అధికారులకు విధించారు. రెండో విడత పెట్టుబడి సాయం కిందట.. ఎకరాకిని రూ. 4వేలు. అక్టోబర్‌లోనే పంపిణీకి ఏర్పాట్లు చేయమని ఆదేశించారు కూడా.

కేసీఆర్ దూకుడు చూసిన వారంతా.. మోడీ నుంచి.. ముందస్తు ఎన్నికలపై గట్టి సూచనలే అందుకున్నారని.. నమ్మడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బహిరంగంగా మాట్లాడిన తొలి సమావేశంలోనే చాలా ఫోర్స్‌గా ముందస్తు సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. టీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే అయినా వెంటనే కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే.. ఈ రోజే అసెంబ్లీని బర్తరఫ్ చేసి ఎన్నికలకు రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ మీద కోమటిరెడ్డి.. మిగతా కాంగ్రెస్ నేతలందరి కంటే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే.. కోమటిరెడ్డి ఎమ్మెల్యే హోదాపై.. కేసీఆర్ రాత్రికి రాత్రే అనర్హతా వేటు వేయించేశారు. కోర్టులు చెప్పినా.. మళ్లీ ఆ ఎమ్మెల్యేహోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు.

కోమటిరెడ్డితో పాటు పొన్నం లాంటి నేతలు కూడా.. ముందస్తుకు సిద్ధమని కేసీఆర్‌కు సవాల్ చేశారు. మొత్తానికి దేశంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది..కానీ తెలంగాణలో అది కాస్త ఎక్కువగానే ఉంది. దానికి కారణం.. కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలపై కసరత్తు ప్రారంభించేయడమే. ప్రతిపక్షాలకు సవాళ్లు విసరడమే. తెలంగాణ ఇచ్చి మరీ… తాము ఓడిపోవడం ఏమిటనుకుంటున్న కాంగ్రెస్.. ఎంత త్వరగా కేసీఆర్‌పై దండెత్తడానికి అవకాశం వస్తుందా.. అని ఎదురు చూస్తోంది. కేసీఆర్ దూకుడు చూస్తూంటే… కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెవిలో చెప్పారేమోనన్న ఊహాగానాలు.. జోరుగానే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close