పవర్‌స్టార్‌ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ఎన్టీఆర్‌!

జనరల్‌గా సినిమా ఆడియో ఫంక్షన్లకు ఇండస్ట్రీలోని సీనియర్‌ దర్శకనిర్మాతలను, సీనియర్‌ హీరోలను పిలిచి వారిచేత ఆడియోను రిలీజ్‌ చేయించడం మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఒక హీరో సినిమా ఆడియో ఫంక్షన్‌కి మరో హీరో గెస్ట్‌గా వెళ్ళి ఆడియో రిలీజ్‌ చెయ్యడం, యూనిట్‌ని బ్లెస్‌ చెయ్యడం ద్వారా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ని క్రియేట్‌ చేసుకుంటున్నారు యంగ్‌ హీరోలు. ఇది ఇండస్ట్రీకి శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు.
ఇప్పుడు ఎన్టీఆర్‌ ఒక అడుగు ముందుకు వేసి పక్క రాష్ట్రంలోని హీరో చేస్తున్న సినిమా ఆడియో రిలీజ్‌ చెయ్యడానికి రెడీ అయ్యాడు. కన్నడలో పవర్‌స్టార్‌గా మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ తన లేటెస్ట్‌ మూవీ ‘చక్రవ్యూహ’ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ని ఆహ్వానించాడు. దానికి ఎన్టీఆర్‌ కూడా ఎలాంటి ఈగోలకు వెళ్ళకుండా వెంటనే ఓకే చెప్పాడు. ఫిబ్రవరి 12న కర్ణాటకలో జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ఛీఫ్‌ గెస్ట్‌గా హాజరవుతున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్య విశేషమేమిటంటే పునీత్‌రాజ్‌కుమార్‌ కోసం థమన్‌ సంగీత సారధ్యంలో ఒక స్పెషల్‌ సాంగ్‌ని హీరోయిన్‌ కాజల్‌తో కలిసి ఎన్టీఆర్‌ పాడాడు. ‘బాద్‌షా’ చిత్రంలో ఎన్టీఆర్‌ కోసం తమిళ్‌ హీరో శింబుచేత పాట పాడించిన థమన్‌ ఇప్పుడు శివరాజ్‌కుమార్‌ కోసం ఎన్టీఆర్‌తో కన్నడ పాట పాడించడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close