ప‌ది క‌థ‌ల్ని ప‌క్క‌న పెట్టిన బాల‌య్య‌

బాల‌కృష్ణ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే ఉంది. ఈసినిమాకి మ‌రింత క్రేజ్ తీసుకురావ‌డం ఎలా అనే విష‌యంలో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. జులై మొద‌టి వారంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. అయితే ఈలోగా వినాయ‌క్ సినిమామొద‌లు కావాల్సింది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాచేయ‌డానికి బాల‌కృష్ణ అంగీక‌రించారు. అన్నీ కుదిరితే బాల‌య్య పుట్టిన రోజున ఈ సినిమాకి కొబ్బ‌రికాయ కొడ‌దామ‌నుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. దానికి కార‌ణం.. క‌థ సెట్ అవ్వ‌క‌పోవ‌డమే. వినాయ‌క్ ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య‌కు దాదాపుగా ప‌ది క‌థ‌లు వినిపించాడ‌ట‌. ఏ క‌థ కూడా బాల‌య్య అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా రాలేద‌ని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయే ప్ర‌మాదంలో ప‌డింది. అయితే వినాయ‌క్ మాత్రం.. బాల‌య్యకు త‌గిన క‌థ త‌యారు చేయ‌డంలో త‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నాడ‌ట‌. త‌న ఆస్థాన క‌థ‌కుడు ఆకుల శివ చెప్పిన క‌థ‌లే కాకుండా, బ‌య‌టి ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌నీ వింటున్నాడ‌ట‌. అయితే… అవేం అంత‌గా సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌ని స‌మాచారం. మ‌రి వినాయ‌క్ క‌థ‌ల వేట ఎప్ప‌టికి పూర్త‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close