సినిమా ప్రమోషన్లకు టీవీ9 పైనే ఆధారపడుతున్న మెగా హీరోలు..!

“మన తల్లుల్ని కించ పరుస్తున్న చానళ్లను మనం ఎందుకు చూడాలి. వాటిని చూడటం మానేయండి..” అనేది పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌కు ఇచ్చిన నినాదం. టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ లాంటి చానళ్లను ఉద్దేశంచి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ చానళ్లను బ్యాన్‌ చేయాలని పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ మాదిరి యుద్ధం చేశారు. గత ఏప్రిల్‌లో ఫిల్మ్ చాంబర్ వేదికగా హైడ్రామా నడిపారు. ఆ తర్వాత చిరంజీవి.. ఇండస్ట్రీలోని హీరోలందరితో సమావేశమయ్యారు. అధికారికంగా బ్యాన్ చేయడం సాధ్యం కాదని తేల్చి.. అనధికారికంగా… అయినా ఆయా చానళ్లను దూరం పెట్టాలనుకున్నారు.

కానీ ఇప్పుడు మెగా క్యాంప్ హీరోలే.. టీవీ 9 స్టూడియోకు క్యూ కడుతున్నారు. సినిమా పబ్లిసిటీ కావాలంటే.. టీవీ 9లో ప్రమోషన్ ఉండాలానే భావిస్తున్నారు. చివరికి చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన “విజేత” సినిమా ప్రమోషన్ కోసం కల్యాణ్‌ దేవ్ నేరుగా.. టీవీ నైన్ స్టూడియోకి వెళ్లిపోయారు. లైవ్ ప్రోగ్రాం ఇచ్చారు. కల్యాణ్‌దేవ్‌ని టీవీ 9 స్టూడియోలో చూసేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు. అందరికీ.. ఏప్రిల్‌లో జరిగిన డ్రామానే గుర్తుకు వచ్చింది. టీవీ 9 మీద మెగా క్యాంప్‌ మొత్తం ఓ రేంజ్‌లో దాడి చేసిన తర్వాత కూడా ప్రమోషన్ల కోసం ఆ చానల్‌ మీద ఆధారపడటం ఏమిటన్న భావన అందరిలోనూ వచ్చింది.

టీవీ 9 సహా మూడు నాలుగు చానళ్లను బ్యాన్‌ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో పలువురు అభిమానులు ఆయా చానళ్లను.. తమ టీవీ సెట్లలో బ్యాన్ చేసుకున్నారు. అభిమానులు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో క్యాంపెయిన్ కూడా నడిపారు. యూట్యూబ్‌లో ఆ చానల్ రేటింగ్‌ పడిపోయేలా చేశారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీనే మళ్లీ ఆ టీవీ చానల్‌ను తమ కుటుంబ హీరోల ప్రమోషన్ల కోసం ప్రొత్సహించడంతో .. వారికి ఎలా సమర్థించుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్‌ పిలుపుని మెగా క్యాంప్ మొత్తం సీరియస్‌గా తీసుకుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మెగా హీరోల బాట మాత్రం వేరేలా ఉంది. సినిమాల ప్రమోషన్‌కు ఆయా చానళ్ల తోడ్పాటు అవసరం అని డిసైడయినట్లున్నారు. ఇక ఆ న్యూస్ చానళ్ల పట్ల తమ విధానం ఏమిటో.. మెగా అభిమానులే నిర్ణయించుకోవాలేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close