ఏపీలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. ! 1000 మందిని గురి పెట్టిన ఉమెన్ చాందీ.. !!

ఆంధ్రప్రదేశ్‌లో పునర్‌వైభవం పొందేందుకు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి చాటాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ, ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్న నాయకులను తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరేలా చేయాలని కొత్తగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఉమెన్ చాందీ నిర్ణయించారు. దీని కోసం కసరత్తు ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 13వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఇప్పటికే తనతో పాటు మళ్లీ పార్టీలో చేరాలంటూ.. తనతో సన్నిహితంగా వ్యవహరించిన నేతలకు ఫోన్లు చేస్తున్నారు.

అప్పట్లో కాంగ్రెస్ లో క్రీయాశీలక పాత్ర పోషించిన ఉండవల్లి, లగడపాటి వంటి వారితో కూడా ఉమెన్ చాందీ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. నాడు కాంగ్రెస్‌వాదులుగా ఉండి, నేడు తటస్థంగా ఉన్న 1000 మందిని ఇప్పటికే లిస్టవుట్ చేశారు. వీరందరితో వన్ బై వన్ చర్చలు జరుపుతున్నారు. వీరిలో చాలా మంది ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో.. ఉమెన్ చాందీ స్వయంగా రంగంలోకి దిగి నేతలతో మాట్లాడుతున్నారు. భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని ఆహ్వానిస్తున్నారు

కేంద్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల్ని కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ బలోపేతం కోసం వాడుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాకపోయినా.. ప్రాంతీయ పార్టీల మద్దతుతు అయినా అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతూండటంతో.. నేతలు కూడా.. పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారన్న అంచనాలున్నాయి. కానీ ఎన్నికలకు దగ్గరకు వస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో ఉన్న కొద్ది పాటి పొటెన్షియల్ లీడర్లు కూడా.. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరాల్సిందేన్న అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ కోలుకోవడం సంగతి తర్వాత.. కిరణ్ చేరికతో వచ్చే మైలేజీ కూడా పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close