స్వలింగ సంపర్కం నేరమా..? కాదా..? మళ్లీ సుప్రీంకోర్టులో విచారణ..!!

మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు…స్వలింగ సంపర్కం అనేది అనేక దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు ఓ సవాల్‌గా మారింది. పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ప్రపంచ దేశాలు.. తంటాలు పడుతున్నాయి. కొన్ని దేశాలు.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. భారత్‌లో ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు అలింగనం చేసుకున్నా వింతగా చూస్తారు. అలాంటి దేశంలో స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలకూ మద్దతు దొరకడం అసాధ్యం. అదీ ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అయితే.. మరీ అసాధ్యం. కానీ అనూహ్యంగా సుప్రీంకోర్టు… 2013కలో ఇచ్చిన తీర్పును సమీక్షించడానికే నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ 2013 సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రధానంగా ఈ కేసు “ఐపీసీ సెక్షన్‌377” గా ప్రచారంలోకి వచ్చింది. ఈ సెక్షన్‌కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. ఈ నేరం కింద జీవితఖైదు లేదా పదేళ్ల జైలు విధించే అవకాశం వుంది. అయితే ఈ సెక్షన్ కొత్తగా పెట్టిందేమీ కాదు. 1861లో నుంచి భారత శిక్షా స్మృతిలో ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ.. 2001లో నాజ్‌ఫౌండేషన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు కూడా.. స్వలింగ మనుషులైనా.. పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్‌ నేరం కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును కొంత మంది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ అనంతరం.. 2013 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి రావడంతో… కాంగ్రెస్ ప్రభుత్వం గే హక్కుల కార్యకర్తలు రివ్యూ పిటిషన్లు వేశారు. అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరిచింది. 2016 ఫిబ్రవరిలో కొంత మంది క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. అయితే దీనిపై ఇప్పుడు విచారణ చేయవద్దని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం తోసి పుచ్చింది.

సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పుని పునఃసమీక్షించాలని నిర్ణయించాంమని ధర్మానసం స్పష్టం చేసింది. కొన్ని రోజుల పాటు.. ఈ కేసు ఇండియాలో హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 26 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close