వైజ‌యంతీకి అచ్చొచ్చిన డేట్‌లో.. ‘దేవ‌దాస్‌’

సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెంటిమెంట్లు ఎక్కువ‌. ఓ సినిమా హిట్ట‌యితే దాని చుట్టూ కొత్త కొత్త సెంటిమెంట్లు పుట్టుకొస్తుంటాయి. వైజ‌యంతీ మూవీస్‌కి సెప్టెంబ‌రు సెంటిమెంట్ ఉంది. సెప్టెంబ‌రు 27న ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం.1’ విడుద‌లై సూప‌ర్ హిట్ కొట్టింది. సెప్టెంబ‌రు 28న చిరుత‌ని విడుద‌ల చేశారు. అదీ హిట్టే. వైజ‌యంతీ మూవీస్ అందించిన మ‌రో సూప‌ర్ హిట్‌.. `శుభ‌ల‌గ్నం` కూడా సెప్టెంబ‌రు 30నే విడుద‌లైంది. అందుకే ఇప్పుడు ‘దేవ‌దాస్‌’ని కూడా సెప్టెంబ‌రులోనే విడుద‌ల చేస్తున్నారు. నాగార్జున‌, నాని క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సినిమా ఇది. శ్రీ‌రామ్ ఆదిత్య దర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే టైటిల్ లోగోని విడుద‌ల చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఫిక్స్ చేశారు. సెప్టెంబ‌రు 27న ఈచిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. నాని ఓ డాక్ట‌ర్‌గా, నాగ్ మాఫియా డాన్‌గా కనిపిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న లింకేమిట‌న్న‌ది స‌స్పెన్స్‌. ఇటీవ‌ల ‘మ‌హాన‌టి’తో ఓ సూప‌ర్ హిట్ కొట్టింది వైజ‌యంతీ మూవీస్‌. మ‌రి ఈ ‘దేవ‌దాస్‌’ ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close