క్రైమ్: పేరు తత్వ పీఠం..! చేసేది చెంబు చోరీలు..! దొరికిన దొంగ బాబా..!!

టీవీ చానళ్లలో “సర్వం ప్రాప్తి రస్తు” అంటూ ప్రవచనాలు బోధించే శివోహం రామ శివానుజమ్ అలియాస్ రామ శివ చైతన్యస్వామి అసలు వేషంలో చెంబులు, చెంబులో నగలు దొంగిలిస్తూంటారు. హైదరాబాద్‌లో తత్వపీఠం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పి.. దొంగతనాలకు కొత్త పద్దతి కనిపెట్టాడు. వివిధ టీవీ ఛానళ్లలో “సర్వం ప్రాప్తి రస్తు” పేరుతో పెయిడ్ ప్రోగ్రామ్‌లు చేసేవాడు. కొద్ది కొద్దిగా పాపులారిటీని పెంచుకుని.. తర్వాత ఎన్టీఆర్ స్టేడియం, విజయవాడ, గుంటూరుల్లో హరిహర శక్తి యాగం పేరుతో హోమాలు, యాగాలను నిర్వహించాడు. ఇలాంటి సందర్భాల్లో వివిధ సమస్యలతో తన దగ్గరకు వచ్చే వారిని.. మెల్లగా ట్రాప్‌ చేశారు.

ఆరోగ్య సమస్యలు, సంసారంలో ఇబ్బందులు వున్న వారు నేరుగా బాబా తన ఆశ్రమానికి పిలిపించుకొని వారికున్న సమస్యలకు పరిష్కారం యాగం చేయడం ద్వారా వస్తుందని నమ్మబలికేవాడు. తనే స్వయంగా తర్వాత వారింటికి వెళ్లి యాగం చేసేవాడు. రెండు కలశాలు తెప్పించి.. ఓ దాంట్లో ఇంట్లో ఉన్న ఆభరణాలనువేయించి మూటగట్టేవాడు. రెండో దాంట్లో.. బియ్యం, రాళ్లు ఉంచేవాడు. యాగం సందర్భంగా…తాను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ… ఉండాలని చెప్పేవాడు. రెండు నెలల తర్వాత వచ్చి తానే కలశాన్నితెరుస్తానిని.. అప్పుడు బంగారం రెట్టింపు అవుతుందని ఆశ పెట్టేవాడు. వెళ్లేటప్పుడు.. బియ్యం, రాళ్లు పెట్టిన కలశాన్ని తీసుకెళ్లేవారు. కానీ అసలు బంగారం పెట్టిన కలశాన్ని తీసుకెళ్తాడు. రాళ్లు, బియ్యం ఉన్న కలశాన్ని యాగం చేయించుకున్న వారికి ఇస్తాడు. తర్వాత ఆ బంగారాన్ని ముత్తూట్, మణప్పురంలలో తాకట్టు పెట్టి జల్సాలు చేసేవాడు.

ఇలా యాగం చేయించుకున్న వారి బాబా ఎప్పుడు కలశం ఓపెన్ చేస్తారా.. రెట్టింపైన బంగారం తీసుకుందామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ బాబా రాలేదు. చివరికి వారే కలశాలను తెరిచి చూసి.. షాక్‌కు గురయ్యారు. బియ్యం, రాళ్ల కలశం తమకు ఇచ్చి.. బంగారం ఉన్న కలశం పట్టుకుపోయాడని గుర్తించి పోలీసుల్ని ఆశ్రయించారు. తత్వపీఠం బాబా ఆట కట్టించిన పోలీసులు రెండు కిలోల బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. ఎంతటి విద్యావంతులైనా.. డబ్బులు, బంగారం రెట్టింపు చేస్తామనే బాబాలను… బురిడీగాళ్లను ఎలా నమ్ముతున్నారోనని పోలీసులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close