ప్రొ.నాగేశ్వర్: కిరణ్ వల్ల కాంగ్రెస్‌కు వచ్చే బలమెంత…?

ఊమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ గా వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ నేతలందర్నీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ క్రియాశీలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరుతున్నారు. త్వరలో మరికొందరు చేరే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పలేం.

“సమైక్యాంధ్ర” ట‌్యాగ్‌ ఉన్నా కిరణ్ ప్రభావం చూపలేదు..!

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా బలంగా లేరు. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మధ్యలో బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో.. యూపీఏ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు… సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం గట్టిగా నిలబడిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన జైసమైక్యంధ్ర పార్టీ పెట్టుకున్నా.. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఏపీ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. చంద్రబాబునాయుడు లేఖ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ త్రీ ప్రకారం చేయండి.. మమ్మల్ని ఎందుకు అడుగుతారని సలహా ఇచ్చారు. అంటే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఏ ప్రభావం చూపించలేకపోయారు. 2014లోచూపించలేని ప్రభావాన్ని 2019లో చూపిస్తారా..?.

“ప్రత్యేకహోదా” ఇష్యూ లేకపోతే బీజేపీలో చేరేవారేమో..?

కిరణ్ ఓ విధానం మీద ఉన్నారా అంటే అదీ లేదు. మధ్యలో బీజేపీలో చేరుతారన్నారు. కానీ చేరలేదు. ప్రత్యేకహోదా ఇష్యూ వచ్చిన తర్వాత బీజేపీలో చేరితే పెద్దగా ప్రయోజనం ఉండదని లెక్కలు వేసుకున్నట్లు ఉన్నారు. నిజంగానే బీజేపీ..కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించింది. సోషల్ ఇంజినీరింగ్ బీజేపీ సమర్థవంతంగా చేస్తుంది. ఏపీలో కూడా… ఓ వైపు కాపు సామాజికవర్గం..మరో వైపు… రెడ్డి సామాజికవర్గాన్ని కిరణ్ సాయంతో ఆకట్టుకుందామని ప్రయత్నించింది. ప్రత్యేకహోదా ఇష్యూ వచ్చిన తర్వాత..బీజేపీతో.. పెద్దగా ప్రయోజనం ఉండదని కిరణ్ అనుకున్నారు. సోదరుడ్ని టీడీపీలో చేర్పించారు. ఈ ప్రకారమే కన్నా లక్ష్మినారాయణ వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు కూడా. కానీ అమిత్ షా ఫోన్ రావడంతో ఆగిపోయారు. బీజేపీలోనే కొనసాగారు. అయితే కిరణ్ మాత్రం.. ఈ విధంగా బీజేపీ గాలానికి చిక్కలేదు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కిరణ్‌కు ప్రజా బలం లేదు..!

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఓ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు కానీ.,.. విడిగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడు కాదు. ఓ పొలిటికల్ బేస్ కానీ.. రాష్ట్ర వ్యాప్త అనుచరగణం కానీ… కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా.. కాంగ్రెస్ పై ప్రజలకు కోపం ఉంది. ఈ భావన తీసుకొచ్చిందే.. కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని కిరణ్ నేరుగా చెప్పారు. అలా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన నాయకుడు.. రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలో చేరితే.. ఎలాంటి రాజకీయ ప్రభావం ఉంటుందన్నది ప్రశ్న. కానీ హర్షకుమార్ తో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొంత మంది నేతలు.. కాంగ్రెస్ కు తిరిగి వస్తే.. కాంగ్రెస్ ప్రచారంలోకి వస్తుంది.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశలే లేవు..!

2019 ఎన్నికలపై ఎలాంటి ఆశలు కాంగ్రెస్ పెట్టుకునే చాన్సే లేదు. కానీ వ్యక్తిగత పలుకుబడి ఉన్న కొంత మంది నాయకుల్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులుగా నిలబెట్టి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ప్రత్యేకహోదా వస్తుందని.. ప్రచారం చేసుకోవాలి. సెలెక్టడ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. ప్రజల్లో కొంత సానుకూలత వచ్చే అవకాశం ఉంది. అంతే కానీ.. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతున్న ఆశ అయితే పెట్టుకోవాల్సిన పని లేదు.

పదవుల కోసమే మళ్లీ కాంగ్రెస్‌లోకి కిరణ్‌..!

రాజకీయాల్లో ఘర్ వాసపీ అనేది ఉండదు. ఎవరు ఏ రాజకీయ పార్టీలో అవకాశం, అధికారం వస్తుందో ఆ పార్టీలో చేరిపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోడీ ప్రభావం తగ్గుతోంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏదో ఓ పదవి సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతోనే కిరణ్ కాంగ్రెస్ లో చేరారు. లేకపోతే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన నేత కాబట్టి..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీ నుంచి కేంద్రమంత్రిగా చాన్సిస్తారు. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరడానికి అదే కారణం.

https://www.youtube.com/watch?v=SEU16wfAKFQ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close