తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టడమే ఒక విశేషంగా మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. పాన్ ఇండియా, ఓటీటీ ట్రెండ్ పెరిగిన తర్వాత దాదాపు అన్ని సినిమాలు ఇంగ్లీష్ పేర్లవైపే చూస్తున్నాయి. కొన్ని సినిమాలకైతే అసలు తెలుగు పేరుతో కూడిన పోస్టర్ డిజైన్ కూడా ఉండటం లేదు. ఇలాంటి తరుణంలో సత్యదేవ్ తన కొత్త సినిమాకు ఓ అచ్చ తెలుగు టైటిల్ను ప్రకటించాడు. అదే ‘సమవర్తి’.
అజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా టైటిల్ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. సమవర్తి అంటే యముడు అని అర్థం. ‘యముడు’ అనేది తెలుగులో పాపులర్ టైటిల్. ఇప్పుడు దానికి పర్యాయపదంగా మరో తెలుగు పదాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అలాగే సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
