జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్ కాబోతోంది. 3 నుంచే ప్రీమియర్లు మొదలైపోతాయి. ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ తో ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలు. అన్నీ యాడ్స్ తో కలుపుకొని.
సినిమాలోని కొన్ని చోట్ల సెన్సార్ బోర్డు బీప్ వేసింది. కొన్ని డైలాగుల్ని పూర్తిగా తొలగించింది. ఈ సినిమాలోని చికిరి పాట సూపర్ డూపర్ హిట్టయ్యిన సంగతి తెలిసిందే. అయితే అందులో ‘సరుకు – సామాను’ పదంపై కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు కూడా పాటలో ఈ పదానికి కత్తెర వేసింది. ఆ స్థానంలో కొత్త మాట వినిపించబోతోంది. ‘బొక్క’, ‘లమ్డీ కొడక’ లాంటి బూతులకు బీప్ లు పడ్డాయి. ఓ పాత్ర అసభ్యకరంగా ఇచ్చిన సంకేతం కూడా.. సెన్సార్ బోర్డు తొలగించింది. కొన్నయితే రాయడానికి కూడా అభ్యంతరకంగా ఉన్నాయి. అవన్నీ ఈనాటి సినిమాల్లో సాధారణ పదాలుగా చలామణీ అయిపోతున్నాయి. కానీ సెన్సార్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే `పెద్ది`కి చాలా చోట్ల బీప్స్ పడ్డాయి. బీప్ సౌండ్ కి ఒప్పుకోకపోతే, ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ దొరకేది. కానీ.. ఏ సర్టిఫికెట్ వస్తే, 18 ఏళ్ల లోపు యువతీ యువకులకు ఈ సినిమా అందుబాటులో లేకుండా పోతుంది. అందుకే.. చిత్రబృందం సెన్సార్ సూచనలు ఒప్పుకొని తీరాల్సివచ్చింది.
బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో కూడా చిత్ర బృందం స్పీడు పెంచింది. ఇటీవల ముంబైలో ట్రైలర్ విడుదల చేశారు. ఈరోజు భూపాల్ లో మరో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
